PM Modi: మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ
ABN , Publish Date - Aug 31 , 2024 | 02:47 PM
ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక వెంబడి కెనెక్టివిటీని మరింత పెంచే మూడు వందే భారత్ రైళ్ల (Vande Bharat Trains)ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) శనివారంనాడు ప్రారంభించారు. మీరట్ సిటీ-లక్నో, మధురై-బెంగళూరు, చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ మధ్య ప్రయాణించే ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని ప్రారంభించినట్టు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 'మేక్ ఇన్ ఇండియా', 'ఆత్మ నిర్భర్ భారత్' చర్యల్లో భాగంగా కొత్త రైళ్లతో మరింత వేగం, సౌకర్యవంతమైన ప్రయాణం సాకరమవుతుందని పేర్కొంది.
'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా వందే భారత్ రైళ్లను తొలిసారిగా 2019 ఫిబ్రవరి 15న ప్రవేశపెట్టారు. సౌకర్యవంతమైన ప్రయాణం, వేగవంతమైన ప్రయాణం కోసం తీసుకువచ్చిన వచ్చిన ఈ రైళ్లు ప్రస్తుతం 100కు పైగా రాకపోకలు సాగిస్తున్నాయి. దేశవ్యాప్తంగా 280 జిల్లాలను కలుపుతూ ప్రయాణం సాగిస్తున్నాయి.
PM Modi: మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో సత్వర న్యాయం జరగాలి
కొత్త రైళ్ల హైలైట్స్..
-మీరట్ సిటీ-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ : మీరట్‌ను లక్నోతో కలిపే తొలి వందే భారత్ రైలు ఇది. పర్యాటకాన్ని పెంచేందుకు, రాష్ట్ర రాజధానితో వేగవంతమైన అనుసంధానం వల్ల స్థానిక పరిశ్రమలకు ఈ రైలు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.
-మదురై-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్: మదురై టెంపుల్ సిటీని బెంగళూరు కాస్మో పాటిటలన్ హబ్‌ను కలుపుతుంది. దీంతో వాణిజ్యం, విద్య, తమిళనాడు-కర్ణాటక మధ్య ఉద్యోగుల రాకపోకలకు మరింత సౌకర్యం కలుగుతుంది.
-చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్: ఈ ప్రాంతంలో తొలి వందే భారత్ సర్వీస్ ఇది. తమిళనాడులోని 726 కిలోమీటర్లను కలుపుతూ 12 జిల్లాల మీదుగా వెళ్తుంది. యాత్రికులు, స్థానికులకు మెరుగైన ట్రావెల్ సదుపాయాన్ని అందిస్తుంది. కాగా, ఈ వందే భారత్ రైళ్లలో కవచ్ టెక్నాలజీ, రొటేటింగ్ చైర్స్, ఫ్రెండ్లీ టాయిలెట్స్, ఇంటిగ్రేటెడ్ బ్రయిలె సిగ్నేజెస్ వంటి అడ్వాన్స్‌డ్ ఫీచర్లు కల్పించారు.
Read More National News and Latest Telugu News