Share News

Jharkhand: విపక్షాలపై ప్రధాని మోదీ విసుర్లు

ABN , Publish Date - Sep 15 , 2024 | 06:45 PM

జార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌లో ఆదివారం నిర్వహించిన భారీ ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార పార్టీ జేఎంఎంతోపాటు కాంగ్రెస్, ఆర్జేడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకు రావాలని ప్రజలకు ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.

Jharkhand: విపక్షాలపై ప్రధాని మోదీ విసుర్లు

రాంచీ, సెప్టెంబర్ 15: రాష్ట్రంలో ఖనిజాలు, మైనింగ్, సైన్యం భూములు దొచుకున్న అధికార జార్ఖండ్ ముక్తి మోర్చ పార్టీని ఇంటికి సాగనంపే సమయం ఆసన్నమైందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆదివారం జంషెడ్‌పూర్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార జేఎంఎంతోపాటు ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీపై ఈ సందర్భంగా ప్రధాని మోదీ నిప్పులు చెరిగారు. తమను లక్ష్యంగా చేసుకుని అవినీతి కేసులు పెడుతుందంటూ బీజేపీపై అధికార జేఏంఏం నేతలు చేస్తున్న ఆరోపణలను ప్రధాని మోదీ ఎండగట్టారు.

Also Read: Haryana Assebly Elections: ఆప్ చేతిలో దెబ్బ తప్పదా..?


కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ కరప్షన్‌లో శిక్షణ పొందిన ఈ ప్రభుత్వం..

జార్ఖండ్‌లోని జేఎంఎం ప్రభుత్వం.. కాంగ్రెస్ స్కూల్ ఆఫ్ కరప్షన్‌లో శిక్షణ పొందిందని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో తమకు ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలకు బాగా అర్థమైందన్నారు. అందుకే భవిష్యత్తు గురించి వారంతా ఆలోచిస్తున్నారని చెప్పారు. ఈ హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో ఉద్యోగాలు విక్రయించేందుకు పుట్టగొడుగుల్లా గ్యాంగులు వెలిశాయని విమర్శించారు.

Also Read: Delhi CM: అరవింద్ కేజ్రీవాల్ వారసురాలు అతిషేనా..?


జార్ఖండ్‌కు ఆ ముగ్గురే శత్రువులు..

జార్ఖండ్ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో అక్రమ చొరబాట్లు ఒకటన్నారు. రాష్ట్రంలోని సంతాల్ పరిగణ, కొల్హన్ ప్రాంతాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందని తెలిపారు. కానీ దీనిని ఒప్పుకునే పరిస్థితిలో అధికార పార్టీ మాత్రం లేదన్నారు. రాష్ట్రానికి ప్రధాన శత్రువులు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేజీ పార్టీలనేని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. అధికారం అందుకొనే క్రమంలో ఓటు బ్యాంక్ రాజకీయాలకు ఆ యా పార్టీలు తెర తీశాయని ఆరోపించారు.

Also Read: Serilingampally MLA: అరెకపూడి గాంధీ నివాసానికి భారీగా చేరుకున్న పోలీసులు


అధికారంలోకి వస్తే.. ఆ ఘటనపై విచారణ జరిపిస్తాం..

ఈ ఏడాది చివరల్లో జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలొకి వస్తే.. ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రవేశం కోసం నిర్వహించిన పరీక్షల సందర్బంగా జరిగిన తొక్కిసలాటపై పలువురు మరణించారన్నారు. ఈ అంశంపై విచారణ జరిపిస్తామని జార్ఖండ్ ప్రజలకు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అలాగే ప్రధాన మంత్రి జన్ మాన్ యోజన ద్వారా అదివాసీలకు బహుళ ప్రయోజనం చేకూరుతుందన్నారు. సెప్టెంబర్ 15వ తేదీన తొలి విడతలో భాగంగా ప్రధాన మంత్రి అవాస్ యోజన్ గ్రామీణ పథకం ద్వారా వేలాది మంది అర్హులైన లబ్దిదారులకు పక్కా ఇళ్లు లభిస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

Also Read: J&K Assembly polls: ముస్లింలను విడగొట్టేందుకే ఇంజనీర్ రషీద్ విడుదల


అనుకూలించని వాతావరణం.. కారులో జంషెడ్‌పూర్‌‌కు..

జార్ఖండ్‌లోని స్టీల్ సీటి జంషెడ్‌పూర్‌లో ర్యాలీలో పాల్లొనేందుకు ప్రధాని మోదీ రాంచీ చేరుకున్నారు. అక్కడి నుంచి జంషెడ్‌పూర్‌కు హెలికాఫ్టర్‌లో చేరుకోవాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించ లేదు. దీంతో రోడ్డు మార్గంలో ర్యాలీ ప్రాంతానికి ప్రధాని మోదీ చేరుకున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చకు చెందిన మాజీ సీఎం చంపయ్ సోరెన్ ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

For More National News and Telugu News

Updated Date - Sep 15 , 2024 | 06:45 PM