Share News

PM Modi: నవరాత్రి వేడుకలు.. మహారాష్ట్ర జగదాంబ ఆలయంలో డోలు వాయించిన మోదీ!

ABN , Publish Date - Oct 05 , 2024 | 01:28 PM

ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. వాశిమ్‌ జిల్లాలోని మాతా జగదంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నవరాత్రులు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, గుడిలోని సంప్రదాయిక ఢోల్‌ను వాయించారు.

PM Modi: నవరాత్రి వేడుకలు.. మహారాష్ట్ర జగదాంబ ఆలయంలో డోలు వాయించిన మోదీ!

ఇంటర్నెట్ డెస్క్: ప్రస్తుతం మహారాష్ట్ర పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. వాశిమ్ జిల్లాలోని మాతా జగదంబ ఆలయాన్ని సందర్శించారు. అక్కడ నవరాత్రులు పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశ ప్రజలందరూ అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతూ పూజ నిర్వహించారు. అనంతరం, గుడిలోని సంప్రదాయిక ఢోల్‌ను వాయించారు. స్థానిక సంస్కృతి సంప్రదాయాల్లో మోదీ ఉత్సాహంగా మమేకమవడం చూసిన స్థానికులు హర్షధ్వానాలు చేశారు. భక్తులందరూ జయజయధ్వానాలు చేస్తూ అయ్మవారి నామస్మరణలో తరించారు.

Haryana Elections: హరియాణాలో ప్రశాంతంగా సాగుతున్న పోలింగ్.. ఓటు హక్కు వినియోగించుకుంటున్న ప్రముఖులు


ఈ సందర్భంగా ప్రధాని నవరాత్రి వేడుక గొప్పదనాన్ని కీర్తించారు. కోట్ల మంది ప్రజలు ఈ పండుగ సందర్భంగా అమ్మవారిని కొలిచి తరిస్తారని అన్నారు. కాగా, ఆలయ సందర్శన సందర్భంగా మోదీ వెంట మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ కూడా ఉన్నారు. మోదీతో కలిసి పూజలో పాల్గొన్నారు. అనంతరం మోదీ.. సంత్ సేవాలాల్ మహరాజ్, సంత్ రామారావ్ మహరాజ్ సమాధులను సందర్శించి నివాళులు అర్పించారు (PM Modi tries hands on traditional dhol in Washim Maharashtra ).

PM Kisaan: రైతులకు శుభవార్త.. నేడే అకౌంట్లలోకి డబ్బులు

ఈ పర్యటనలో భాగంగా ప్రధాని బంజార జనులు సంస్కృతి, కళారూపాలను ప్రదర్శించే బంజారా విరాసత్ మ్యూజియంను ప్రారంభించారు. వ్యవసాయ, పశు సంవర్ధక శాఖలకు సంబంధించి రూ.23,300 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను కూడా ప్రారంభించారు.


ఈ రోజు ఉదయం నాదేండ్ ఎయిర్‌పోర్టులో దిగిన ప్రధాని హెలికాఫ్టర్‌ ద్వారా వాశిమ్ జిల్లాలోని మాతా జగదంబ మందిరాన్ని చేరుకున్నారు. తదుపరి ఆయన థానే, పూణెల్లో పలు మౌలిక వసతుల ప్రాజెక్టులు కూడా ప్రారంభిస్తారు. అనంతరం, 18వ విడత పీఎమ్ - కిసాన్ సమ్మాన్ నిధులను స్థానిక రైతులకు పంపిణీ చేయనున్నారు. ఈ విడతలో మొత్తం రూ.20 వేల కోట్ల నిధులను సుమారు 9.4 కోట్ల మంది రైతులకు మంజూరు చేసేందుకు ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. దీంతో, ఈ పథకంలో రైతులకు మొత్తం రూ.3.45 లక్షల కోట్ల నిధులు బదిలీ చేసినట్టు అవుతుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

PM Internship: పీఎం ఇంటర్న్‌షిప్‌ పోర్టల్‌లో 2,200 వేకెన్సీలు

Read Latest and National News

Updated Date - Oct 05 , 2024 | 01:57 PM