Share News

PM Modi Kuwait Visit: కువైట్ చేరుకున్న మోదీ.. రక్షణ, భద్రతపై చర్చలు

ABN , Publish Date - Dec 21 , 2024 | 04:10 PM

మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు.

PM Modi Kuwait Visit: కువైట్ చేరుకున్న మోదీ.. రక్షణ, భద్రతపై చర్చలు

కువైట్ సిటీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) రెండ్రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారంనాడు కువైట్ (Kuwait) చేరుకున్నారు. ఆ దేశ రాజు షేక్ మిషాల్ అల్‌అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. కువైట్‌కు భారత ప్రధాని వెళ్లడం 43 ఏళ్ల తర్వాత ఇదే మొదటిసారి. 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్‌లో పర్యటించారు.

Ukraine: రష్యాలోని బహుళ అంతస్తుల భవనాలపై ఉక్రెయిన్ డ్రోన్ల దాడి


కాగా, మోదీ తన పర్యటనలో కువైట్ అగ్ర నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ముఖ్యంగా రక్షణ, భద్రత, వాణిజ్యంపై ప్రధానమంత్రి దృష్టి సారించనున్నట్టు చెబుతున్నారు. ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం, రక్షణ సహకార ఒప్పందంపై చర్చలు జరుగుతాయని, వీటితో పాటు పలు కీలక రంగాలకు సంబంధించిన ఒప్పందాలపై సంతకాలు జరుగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. మోదీ పర్యటనతో ఇండియా, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) మధ్య సంబంధాలు బలోపేతమవుతాయని ఆశిస్తున్నట్టు విదేశాంగ శాఖలోని ఓవర్సీస్ ఇండియన్ అఫైర్స్ సెక్రటరీ అరుణ్ కుమార్ ఛటర్జీ తెలిపారు. కువైట్ ప్రస్తుతం జీసీసీకి అధ్యక్షత వహిస్తోంది.


మోదీ కువైట్ పర్యటనలో భాగంగా అక్కడ జరిగే 'హలా మోదీ' కార్యక్రమంలో సుమారు 4 వేల మంది భారతీయులను కలుసుకుంటారు. అరేబియా గల్ఫ్ కప్, ఫుట్‌బాల్ టోర్నమెట్ ప్రారంభోత్సవానికి కూడా హజరయ్యే అవకాశం ఉంది. కువైట్‌ ట్రేడింగ్ భాగస్వాములలో ఇండియా కీలకంగా ఉంది.


ఇవి కూడా చదవండి..

Donald Trump: 18 వేల మంది భారతీయుల మెడపై.. ట్రంప్‌ సర్కారు బహిష్కరణ కత్తి!

Sunitha Williams: సునీతా విలియమ్స్ తిరిగొచ్చేనా.. మళ్లీ తేదీ మార్చిన నాసా

Read Latest and International News

Updated Date - Dec 21 , 2024 | 04:10 PM