Share News

Ram Mandir: ఉపవాస దీక్ష విరమించిన ప్రధానమంత్రి మోదీ

ABN , Publish Date - Jan 22 , 2024 | 02:42 PM

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో యావద్దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్ధాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు.

Ram Mandir: ఉపవాస దీక్ష విరమించిన ప్రధానమంత్రి మోదీ

అయోధ్య: అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనతో యావద్దేశం పులకించింది. నభూతో నభవిష్యతి అనే రీతిలో నిర్వహించిన బాలరాముని విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం మధ్యాహ్నం 2 గంటలతో ముగియడంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తన ఉపవాస దీక్షను విరమించారు. ప్రధాన అర్చకుల నుంచి పవిత్ర తీర్ధాన్ని స్వీకరించి వారి ఆశీర్వాదాలు పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయోధ్య రామాలయ జ్ఞాపికను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధానికి బహూకరించారు.

Updated Date - Jan 22 , 2024 | 02:42 PM