Police Department: పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్‌కు అవకాశం
ABN , Publish Date - Oct 31 , 2024 | 12:44 PM
పోలీసులు అంటేనే ఇప్పటీ సామాన్యుడి భయమే... అందుకు పోలీసు శాఖ జనస్నేహిగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారులకు చెబుతుంటారు. ఇప్పటి వరకు పోలీసు శాఖలో ఆడ, మగ పోలీసులే కనపించే వారు. ఇక నుండి ట్రాన్స్‌జెండర్స్ కూడా ప్రజా సేవ చేసేందుకు కర్ణాటక(Karnataka) రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్స్(Transgenders)కు 1 శాతం రిజర్వు చేయడంతో ఇక నుండి ప్రజలను కాపాడడంతో ట్రాన్స్‌జెండర్స్ తమవంతు బాధ్యత వహించనున్నారు.
- లాఠీ పట్టనున్న మంగళముఖి మధుశ్రీ
బళ్లారి(బెంగళూరు): పోలీసులు అంటేనే ఇప్పటీ సామాన్యుడి భయమే... అందుకు పోలీసు శాఖ జనస్నేహిగా ఉండాలని పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారులకు చెబుతుంటారు. ఇప్పటి వరకు పోలీసు శాఖలో ఆడ, మగ పోలీసులే కనపించే వారు. ఇక నుండి ట్రాన్స్‌జెండర్స్ కూడా ప్రజా సేవ చేసేందుకు కర్ణాటక(Karnataka) రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించడంతో పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్స్(Transgenders)కు 1 శాతం రిజర్వు చేయడంతో ఇక నుండి ప్రజలను కాపాడడంతో ట్రాన్స్‌జెండర్స్ తమవంతు బాధ్యత వహించనున్నారు. సమాజంలో ట్రాన్స్‌జెండర్స్ అంటే ఒకరకమైన చిన్నచూపుకు గురవుతుంటారు.
ఈ వార్తను కూడా చదవండి: Hero Darshan: బళ్లారి జైలు నుంచి దర్శన్ విడుదల..
అవేమి పట్టించుకోకుండా ఎంతోమంది ట్రాన్స్‌జెండర్స్ స్వావలంబన జీవనం గడుపుతూ సమాజంలో మాదిరిగి నిలుస్తున్నారు. ఎలాంటి తప్పుదారి పట్టకుండా సమాజంలో మాదిరిగా నిలిచిన ట్రాన్స్‌జెండర్స్ ప్రస్తుతం మన మధ్యలోకి రానున్నారు. ప్రస్తుతం కొప్పళ నగరానికి చెందిన ఓ ట్రాన్స్‌జెండర్ పోలీసు శాఖలో సేవలు అందించడానికి సిద్దమైంది. ఈ కోవలోనే కొప్పళ జిల్లా కారటిగి తాలూకా తొండిహాల్ గ్రామానికి చెందిన ముధుశ్రీ అనే ట్రాన్స్‌జెండర్ పోలీసు కానిస్టేబుల్‌గా ఎన్నికయ్యారు కేవలం కొన్ని రోజుల్లోనే చేతిలో లాటీ పట్టుకుని ప్రజల రక్షణ సిద్దమవుతున్నారు.
తద్వారా భవిష్యత్‌లో పోలీసు శాఖలో ట్రాన్స్‌జెండర్స్ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌జెండర్స్‌కు 1ు శాతం రిజర్వేషన్ కల్పించిన నేపథ్యంలో కొప్పళ జిల్లాకు చెందిన ముధుశ్రీ అనే ఓ ట్రాన్స్‌జెండర్‌కు అపురూపమైన అవకాశం దక్కింది. హిజ్రాలను కన్నడలో మంగళముఖిగా పిలుస్తారు. మంగళ ముఖిగా మధుశ్రీ ప్రస్తుతం లిఖతగా పేరు మార్చుకున్న దేహదారుడ్య పరీక్షల్లో కూడా పాసైంది. ప్రస్తుతం అధికారుల నుండి అంతిమ ఆదేశాల కోసం వేచి చూస్తోంది. తద్వారా ప్రస్తుతం పోలీసు శాఖలో సేవలు అందించేందుకు లిఖిత సిద్దంగా ఉంది.
మొదట్లో మారుతిగా అలియాస్ మదుశ్రీగా మారిన మంగళముఖి విశిష్టమైన సాధనకు గ్రామంలో మన్ననలు పొందుతోంది. నోటిఫికేషన్ ప్రకటన తరువాత అర్జివేసి అనంతరం ఒక నెల పాటు ఆన్‌లైన్‌లో కోచింగ్ తీసుకుని ఇంటిలో రాతపరీక్షకు ప్రిపేరై పరీక్షల్లో పాసైనట్లు మధు శ్రీ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం అన్ని శాఖలో మంగళ ముఖిలకు ఇదేరీతిలో అవకాశాలు కల్పించి మంగళముఖిల సంక్షేమానికి కృషి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ వల్లే విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి
ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!
Read Latest Telangana News and National News