Share News

Bihar: నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన వంతెన

ABN , Publish Date - Aug 17 , 2024 | 05:28 PM

బీహార్‌లో పాత వంతనెలు, నిర్మాణంలో ఉన్న వంతెనలు వరుసగా కుప్పకూలిన ఘటనలు ఇటీవల బెంబేలెత్తించగా, తాజాగా అగువనీ ఘాట్-సుల్తాన్ గంజ్ ‌మధ్య నిర్మాణంలో ఉన్న వంతెనలోని ఒక భాగం శనివారం ఉదయం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఈ వంతెనలోని వివిధ భాగాలు కుప్పకూలంగా వరుసగా ఇది మూడోసారి.

Bihar: నిర్మాణంలో ఉండగా మూడోసారి కూలిన వంతెన

పాట్నా: బీహార్‌ (Bihar)లో పాత వంతనెలు, నిర్మాణంలో ఉన్న వంతెనలు వరుసగా కుప్పకూలిన ఘటనలు ఇటీవల బెంబేలెత్తించగా, తాజాగా అగువనీ ఘాట్-సుల్తాన్ గంజ్ ‌మధ్య నిర్మాణంలో ఉన్న వంతెనలోని ఒక భాగం శనివారం ఉదయం కుప్పకూలింది. నిర్మాణంలో ఉన్న ఈ వంతెనలోని వివిధ భాగాలు కుప్పకూలడం వరుసగా ఇది మూడోసారి.


రోడ్ కన్‌స్ట్రక్షన్ డిపార్ట్‌మెంట్ (ఆర్‌సీడీ) అధికారుల సమాచారం ప్రకారం, ఈ వంతెనలోని కొంతభాగం 2023 జూన్ 5 న కుప్పకూలి గంగానదిలో కొట్టుకుపోయింది. ఇదే వంతెనలోని మరి కొంత భాగం 2022 ఏప్రిల్‌లో కుప్పకూలింది. తాజాగా, నెంబర్ 9-10 స్తంభాల మధ్య భాగం కూలిపోయింది. రూ.1710 కోట్ల నిర్మాణ వ్యయంతో ఎస్‌పీ సింగ్లా కన్‌స్ట్రక్షన్ లిమిటెడ్ ఈ వంతెన నిర్మాణం జరుపుతోంది. గంగానదిపై నిర్మిస్తున్న ఈ వంతెన నిర్మాణం వల్ల సుల్తాన్ గంజ్, ఖగరియా, సహర్సా, మాధేపుర, సుపౌల్ మధ్య ప్రయాణసమయం ఆదా అవుతుంది. గంగానది వెంబడి ఎన్‌హెచ్31, ఎన్‌హెచ్80లను కూడా ఈ వంతెన కలుపుతుంది.

Bomb threats in malls: డీఎల్‌ఎఫ్ మాల్‌కు బాంబు బెదిరింపు.. జనం బెంబేలు


డిజైన్ లోపాలతో పాటు నిర్మాణ సామగ్రి నాణ్యతతో రాజీపడినట్టు ఐఐటీ రూర్కీ నిపుణులు ఇటీవల వెల్లడించినప్పటికీ వంతెన నిర్మాణ సంస్థకే తిరిగి పునర్నిర్మాణ బాధ్యతను ఆర్‌సీడీ అప్పగించింది. తొలుత నిర్మాణ కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని ఆర్‌సీడీ చెప్పినప్పటకీ అదే నిర్మాణ సంస్థకు పునర్నిర్మాణ బాధ్యతలను అప్పగించింది. వంతెనల నిర్మాణంలో నాసిరకం ప్రమాణాలు పాటిస్తున్నారని పలువురు ఆందోళనలు వ్యక్తం చేసినప్పటికీ ఆర్‌సీడీ కానీ, ఆర్‌సీడీ బాధ్యతలు నిర్వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి విజయ్ కుమార్ సిన్హా కానీ వాటిని పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.

Read More National News and Latest Telugu News

Updated Date - Aug 17 , 2024 | 05:28 PM