Lok Sabha dissolves: 17వ లోక్‌సభను రద్దు చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ABN , Publish Date - Jun 05 , 2024 | 07:32 PM
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 17వ లోక్‌సభ ను రద్దు చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ) సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం సిఫారసు చేసింది.
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) 17వ లోక్‌సభ (17th Lok Sabha)ను రద్దు (Dissolve) చేశారు. ప్రస్తుత లోక్‌సభను రద్దు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) సారధ్యంలోని కేంద్ర క్యాబినెట్ బుధవారం ఉదయం సిఫారసు చేసింది. ఆ వెంటనే మోదీ తన రాజీనామాతో పాటు మంత్రివర్గ రాజీనామా పత్రాలను రాష్ట్రపతిని కలిసి నేరుగా కలిసి సమర్పించారు. రాష్ట్రపతి వెంటనే ఆమోదం తెలుపుతూ, కొత్త ప్రభుత్వం ప్రమాణస్వీకారం చేసేంతవరకూ ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగాలని మోదీని కోరారు. అనంతరం కొద్ది గంటలకే 17వ లోక్‌సభను రద్దయినట్టు రాష్ట్రపతి భవన్ నుంచి ఒక ప్రకటన వెలువడింది.
Lok sabha dissolution: 17వ లోక్‌సభ రద్దుకు కేంద్ర మంత్రివర్గం సిఫారసు
''జూన్ 5వ తేదీ 2024న కేంద్ర మంత్రివర్గం చేసిన సిఫారసు మేరకు రాజ్యాంగంలోని 85వ నిబంధన సబ్-క్లాజ్ (2) కింద నాకు సంక్రమించిన అధికారాలను వినియోగించుకుంటూ 17వ లోక్‌సభను రద్దు చేస్తున్నాను'' అని రాష్ట్రపతి భవన్ నుంచి వెలువడిన ప్రకటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. కాగా, ప్రస్తుత లోక్‌సభ రద్దు కావడంతో 18వ లోక్‌సభ ఏర్పాటుకు, కొత్త ప్రభుత్వం కేంద్రంలో పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. షెడ్యూల్ ప్రకారం 17వ లోక్‌సభ గడువు జూన్ 16వ తేదీతో ముగియాల్సి ఉంది.
For Latest News and National News Click Here