PM Modi: దేశంలోనే తొలి అండర్ వాటర్ రివర్ మెట్రో.. ప్రారంభించిన ప్రధాని..
ABN , Publish Date - Mar 15 , 2024 | 04:00 PM
దేశంలోనే నీటి అడుగున నడిచే తొలి మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కోల్‌కతా ( Kolkata ) లోని ఎస్ప్లానేడ్ నుంచి హౌరా మైదాన్ వరకు దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది.
దేశంలోనే నీటి అడుగున నడిచే తొలి మెట్రో మార్గాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. కోల్‌కతా ( Kolkata ) లోని ఎస్ప్లానేడ్ నుంచి హౌరా మైదాన్ వరకు దేశంలోనే తొలి అండర్ రివర్ మెట్రో సర్వీసు ప్రారంభమైంది. ఈ మార్గంతో పాటు రూబీ-గారియా, తరటాలా-మజెర్‌హట్ అనే మరో రెండు మెట్రో మార్గాలను ప్రారంభించారు. అనంతంర విద్యార్థులతో కలిసి అండర్ వాటర్ మెట్రోలో ప్రయాణించారు. ప్రధానిని చూసేందుకు ఉదయం నుంచే ఎస్ప్లానేడ్ మెట్రో స్టేషన్ వద్ద ప్రజలు గుమిగూడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సీవీ ఆనంద్ బోస్, ప్రతిపక్ష నేత సువేందు అధికారి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత్ మజుందార్ పాల్గొన్నారు.
ఎస్ప్లానేడ్ మెట్రో స్టేషన్ నుంచి అనేక మెట్రో ప్రాజెక్టులను ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో హుషారుగా, ఉల్లాసంగా సంభాషించారు. కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రధాన మంత్రి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. "ఇది కలకత్తా ప్రజలకు చాలా ప్రత్యేకమైన రోజు. నగరంలో మెట్రో వ్యవస్థ బాగా అభివృద్ధి చెందింది. ఇది కమ్యూనికేషన్ వ్యవస్థను వేగవంతం చేస్తుంది. ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుంది." అని అన్నారు.
మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.