Share News

మరోసారి రష్యా పర్యటనకు మోదీ

ABN , Publish Date - Oct 19 , 2024 | 02:59 AM

ప్రధాని మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు కజన్‌లో జరగనున్న 16వ బ్రిక్స్‌ ....

మరోసారి రష్యా పర్యటనకు మోదీ

న్యూఢిల్లీ, అక్టోబరు 18: ప్రధాని మోదీ మరోసారి రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఆహ్వానం మేరకు కజన్‌లో జరగనున్న 16వ బ్రిక్స్‌ సదస్సులో పాల్గొనేందుకు ఈనెల 22, 23 తేదీల్లో మోదీ అక్కడ పర్యటించనున్నారని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సందర్భంగా బ్రిక్స్‌ సభ్య దేశాల నేతలతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారని తెలిపింది. కాగా, ఈ ఏడాది మోదీ రష్యా పర్యటనకు వెళ్లడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో ఆయన రష్యాలో పర్యటించారు.

Updated Date - Oct 19 , 2024 | 02:59 AM