PM Modi: కాసేపట్లో అధికారికంగా ప్రధాని బాధ్యతలు.. మోదీ మొదటి సంతకం దేనిపైనంటే..!
ABN , Publish Date - Jun 10 , 2024 | 11:34 AM
వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అధికారికంగా ప్రధాని బాధ్యతలను మోదీ కాసేపట్లో చేపట్టనున్నారు. సౌత్ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు.
వరుసగా మూడోసారి దేశ ప్రధానిగా నరేంద్రమోదీ రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో అధికారికంగా ప్రధాని బాధ్యతలను మోదీ కాసేపట్లో చేపట్టనున్నారు. సౌత్ బ్లాక్‌లోని పీఎంవోలో మోదీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రధానిగా అధికారికంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తన కేబినెట్‌లో మంత్రులకు శాఖలు కేటాయిస్తారు. ఇవాళ సాయంత్రం ఐదు గంటలకు మోదీ 3.0లో తొలి కేబినెట్ భేటీ జరగనుంది. ఈలోపు మంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తికానుంది. మోదీ నేతృత్వంలో జరగనున్న మంత్రి మండలి సమావేశంలో 71 మంది మంత్రులు పాల్గొంటారు. ప్రభుత్వ లక్ష్యాలు, విధానాలపై కొత్త మంత్రులకు మోదీ దిశానిర్ధేశం చేయనున్నారు. కొత్త మంత్రివర్గంలో 36 మంది గతంలో మంత్రులుగా చేసినవాళ్లుండగా.. 35 మంది కొత్తవాళ్లున్నారు. వీరిలో కొందరికి గతంలో మంత్రులుగా చేసిన అనుభవం ఉంది. మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత 120 రోజుల కార్యాచరణను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈరోజు సాయంత్రం లేదా రేపు అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 120 రోజుల కార్యాచరణ ప్రణాళికలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ప్రధాని మోదీ అధికారులతో చర్చించనున్నారు.
Cabinet Meeting: ఇవాళ సాయంత్రం 5 గంటలకు కేంద్ర కేబినెట్ మీటింగ్
తొలి సంతకం..
ప్రధానిగా వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత మోదీ తొలి సంతకం దేనిపై పెడతారనే ఆసక్తి నెలకొంది. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒకదానిపై తొలి సంతకం పెట్టే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ కింద ఆరోగ్య పథకాన్ని 70 ఏళ్లు పైబడిన వయో వృద్ధులకు వర్తింపచేస్తామంటూ ఎన్నికల వేళ మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీపై తొలి సంతకం పెట్టే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు అగ్నివీర్ స్కీమ్‌లో మార్పులపై తొలి సంతకం చేయవచ్చనే చర్చ ఉన్నప్పటికీ.. సంక్షేమానికి సంబంధించిన ఫైల్‌పై మోదీ తొలి సంతకం చేసే అవకాశాలు ఎక్కువుగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై మరికొద్ది గంటల్లో క్లారిటీ రానుంది.
VK Pandyan: రాజకీయాలకు పాండ్యన్ బైబై
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Read More National News and Latest Telugu News