Share News

PM Modi:మన్‌ కీ బాత్‌లో తన తల్లిని గుర్తుచేసుకున్న ప్రధాని.. దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే..

ABN , Publish Date - Jun 30 , 2024 | 12:24 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు రావడంతో ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్‌ కార్యక్రమానికి విరామం ప్రకటించారు.

PM Modi:మన్‌ కీ బాత్‌లో తన తల్లిని గుర్తుచేసుకున్న ప్రధాని.. దేశ ప్రజలకు ఇచ్చిన సందేశం ఇదే..
Modi With Mother

దేశంలో సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఎన్డీయే కూటమికి మెజార్టీ సీట్లు రావడంతో ప్రధానిగా మోదీ మూడోసారి అధికారం చేపట్టారు. ఎన్నికల సమయంలో ప్రతినెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్‌ కార్యక్రమానికి విరామం ప్రకటించారు. మరోసారి అధికారంలోకి వస్తే మన్‌ కీ బాత్ పున: ప్రారంభిస్తానని ప్రకటించారు. ఎన్నికల ముందు చెప్పినట్లు సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి ఎపిసోడ్‌ను.. మొత్తంగా 111వ మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడారు. మొదట ఎన్డీయే కూటమికి ఘన విజయాన్ని అందించిన దేశ ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రధాని మోదీ మన్ కీ బాత్‌లో తన తల్లి హీరాబాను గుర్తు చేసుకున్నారు. నా ప్రియమైన మిత్రులారా.. ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే, మీరు ఖచ్చితంగా 'అమ్మా' అని సమాధానం చెబుతారు. మనందరి జీవితంలో 'అమ్మ'కి అత్యున్నత స్థానం ఉందంటూ తన తల్లిని ప్రధాని గుర్తు చేసుకున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ తమ తల్లితో కలిసి లేదా ఆమె పేరుతో ఒక మొక్క నాటాలని దేశ ప్రజలను మోదీ కోరారు. అమ్మ పేరుతో ఒక చెట్టు ప్రచారానికి మోదీ శ్రీకారం చుట్టారు. తాను తన అమ్మ పేరుతో మొక్క నాటానని చెప్పారు. అమ్మ పేరుతో మొక్కలు నాటడం ద్వారా తల్లిని గౌరవించడంతో పాటు మాతృభూమిని కాపాడుకోవచ్చన్నారు.


భారత అథ్లెట్లకు శుభాకాంక్షలు..

జూలైలో జరిగే పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనే భారతీయ అథ్లెట్లకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. అలాగే 'Cheer4Bharat' హ్యాష్‌ట్యాగ్‌తో వారిని ప్రోత్సహించాలని దేశ ప్రజలను కోరారు. కొన్ని నెలల విరామం ఉన్నప్పటికీ మీ నుండి లక్షల సందేశాలు వచ్చాయని.. వాటిని చూడటం తనకు సంతోషంగా ఉందన్నారు. ఇప్పటికీ మన్ కీ బాత్ స్ఫూర్తి చెక్కుచెదరకుండా ఉందన్నారు. గిరిజనులు జరుపుకునే 'హుల్ దివాస్' సందర్భంగా ప్రధాని మోదీ తన శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో సంతాలీ తెగల ధైర్యసాహసాలకు ప్రతీకగా జూన్30న ఈ దివస్ జరుపుకుంటారని తెలిపారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More National News and Latest Telugu News

Updated Date - Jun 30 , 2024 | 12:24 PM