Share News

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఆగని రగడ

ABN , Publish Date - Nov 09 , 2024 | 06:05 AM

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో మూడో రోజు శుక్రవారమూ నిరసనలు కొనసాగాయి. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏలను పునరుద్ధరించాలన్న తీర్మానంపై ఈ వివాదం నెలకొంది.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో ఆగని రగడ

శ్రీనగర్‌, నవంబరు 8 : జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీలో మూడో రోజు శుక్రవారమూ నిరసనలు కొనసాగాయి. ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏలను పునరుద్ధరించాలన్న తీర్మానంపై ఈ వివాదం నెలకొంది. ఎమ్మెల్యే షేక్‌ కుర్షీద్‌ అహ్మద్‌ను మార్షల్స్‌ ద్వారా అసెంబ్లీ నుంచి బయటకు పంపారు. బీజేపీకి చెందిన సునీల్‌ శర్మ ప్రసంగిస్తుండగా... అవామీ ఇత్తెహాద్‌ పార్టీకి చెందిన షేక్‌ కుర్షీద్‌ ఆర్టికల్‌ 370, ఆర్టికల్‌ 35ఏలను పునరుద్ధరించాలని రాసున్న బ్యానర్‌ పట్టుకుని అసెంబ్లీ వెల్‌లో నిలబడ్డారు. బీజేపీ ఎమ్మెల్యేలు వెంటనే దాన్ని లాక్కుని చించివేశారు. తమ నిరసన కొనసాగించారు. 15 మంది బీజేపీ ఎమ్మెల్యేలు వెల్‌లోకి చేరుకోవడంతో స్పీకర్‌ అబ్దుల్‌ రహీం రేదర్‌ ఆదేశాలతో మార్షల్స్‌ వారిని సభ నుంచి బయటకు తీసుకువెళ్లారు.

Updated Date - Nov 09 , 2024 | 06:05 AM