Share News

Banwarilal purohit: గవర్నర్ ఆకస్మిక రాజీనామా... కారణం ఏమిటంటే

ABN , Publish Date - Feb 03 , 2024 | 04:14 PM

పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ఇతర కమిట్‌మెంట్ల రీత్యా పంజాబ్ గవర్నర్‌ పదవికి, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలని పురోహిత్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

Banwarilal purohit: గవర్నర్ ఆకస్మిక రాజీనామా... కారణం ఏమిటంటే

న్యూఢిల్లీ: పంజాబ్ గవర్నర్, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ బన్వరిలాల్ పురోహిత్ (Banwarilal Purohit) రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలు, కొన్ని ఇతర కమిట్‌మెంట్ల రీత్యా పంజాబ్ గవర్నర్‌ పదవికి, ఛండీగఢ్ అడ్మినిస్ట్రేటర్ పదవికి రాజీనామా చేస్తున్నానని, తన రాజీనామాను అంగీకరించాలని ఆయన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను ఆయన శుక్రవారంనాడు కలుసుకున్నారు.


ఛండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ ఇటీవల అనూహ్య విజయం సాధించింది. తక్కిన మూడు పదవులను కూడా నిలుపుకొంది. దీంతో కాంగ్రెస్-ఆప్ కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రిసైడింగ్ అధికారి బ్యాలెట్ పేపర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డారంటూ ఇరు పార్టీలు ఆరోపించాయి. ఈ క్రమంలో బన్వరిలాల్ పురోహిత్ రాజీనామా చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

Updated Date - Feb 03 , 2024 | 04:14 PM