Punjab: ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు అరెస్ట్
ABN , Publish Date - Jul 12 , 2024 | 02:41 PM
అతివాద సిక్కు బోధకుడు, ఖాదూర్ సాహిబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని జలంధర్‌లో పోలీస్ ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
చండీగఢ్, జులై 12: అతివాద సిక్కు బోధకుడు, ఖాదూర్ సాహిబ్ ఎంపీ అమృత్ పాల్ సింగ్ సోదరుడు హర్‌ప్రీత్ సింగ్ డ్రగ్స్‌తో పట్టుబడ్డాడని జలంధర్‌లో పోలీస్ ఉన్నతాధికారి శుక్రవారం వెల్లడించారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఫిల్లౌరి నుంచి వస్తున్న అతడి వాహనాన్ని తనిఖీ చేయగా 5 గ్రాముల మెథాంఫేటమైన్ లభ్యమైందని చెప్పారు. అతడితోపాటు ఉన్న మరో వ్యక్తిని సైతం అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ కేసులో వారిని విచారిస్తున్నామన్నారు. వీరిద్దరి స్వస్థలం అమృత్‌సర్ అని పోలీస్ ఉన్నతాధికారి వివరించారు.
హర్‌ప్రీత్ సింగ్ సోదరుడు అమృత్ పాల్ సింగ్.. వారిస్ పంజాబ్ దే నిషేధిత సంస్థ అధినేత ఉన్నారు. అయితే జాతీయ భద్రత చట్టం కింద అరెస్టయిన అమృత్ పాల్ సింగ్‌తోపాటు ఆయన తొమ్మిది మంది అనుచరులు ప్రస్తుతం అసోంలోని డిబ్రూఘడ్ జైల్లో ఉన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఖాదూర్ సాహెబ్ లోక్‌సభ స్థానం నుంచి అమృత్ పాల్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన..తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నేత కుల్‌బిర్ సింగ్ జైరాపై 197,120 ఓట్ల అధిక్యంతో గెలుపొందారు.
Also Read: Puja Khedkar: మనోరమా కేడ్కర్ తుపాకీతో హల్‌చల్.. వీడియో వైరల్
గతేడాది ఫిబ్రవరి 23వ తేదీన కస్టడీలో ఉన్న తన అనుచరుడిని విడిపించుకోనేందుకు అజనాల్ పోలీస్ స్టేషన్ వద్ద అమ్రిత్ పాల్ సింగ్‌తోపాటు ఆతడి అనుచరులు ఆలజడి సృష్టించారు. ఈ నేపథ్యంలో అమృత్ పాల్ సింగ్‌తోపాటు తొమ్మిది మంది అనుచరులను మెగా రోడే గ్రామంలో జాతీయ భద్రత చట్టం కింద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వారిని అసోంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. దీంతో నాటి నుంచి అమృత్ పాల్ సింగ్ జైల్లో ఉన్నారు. జులై 5వ తేదీన అమృత్ పాల్ సింగ్ లోక్ సభ సభ్యుడిగా ప్రమాణం చేశారు. అందుకోసం నాలుగు రోజులు పేరోల్‌పై ఆయన్ని విడుదల చేశారు.
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News