Rabri Devi: బీహార్ శాసనమండలి విపక్ష నేతగా రబ్రీదేవి
ABN , Publish Date - Feb 16 , 2024 | 07:30 PM
బీహార్ శాసన మండలికి ఆర్జేడీ విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా రబ్రీదేవి కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చోటుచేసుకోగానే ఆయన స్థానంలో 1997లో రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు.
పాట్నా: బీహార్ శాసన మండలికి ఆర్జేడీ (RJD) విపక్ష నేతగా మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత రబ్రీదేవి (Rabri Devi) ఎన్నికయ్యారు. రాష్ట్ర శాసనసభా పక్ష నేతగా రబ్రీదేవి కుమారుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఉన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ పేరు చోటుచేసుకోగానే ఆయన స్థానంలో 1997లో రబ్రీదేవి బీహార్ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. 1999 నుంచి 2000 వరకూ, తిరిగి 2000 నుంచి 2005 వరకూ ఆమె సీఎం పదవిలో కొనసాగారు. బీహార్ తొలి మహిళా ముఖ్యమంత్రి కూడా ఆమెనే కావడం విశేషం. 2022 అక్టోబర్‌లో లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో విపక్ష నేతగా కూడా రబ్రీ దేవి ఉన్నారు.