Share News

బహిరంగ చర్చకు నేను రెడీ.. కానీ మోదీ రారు: రాహుల్‌

ABN , Publish Date - May 19 , 2024 | 04:26 AM

వివిధ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ శనివారం మరోసారి ప్రధాని మోదీకి సవాలు విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రఽధానే ముందుకు రాకపోవచ్చని అన్నారు.

బహిరంగ చర్చకు నేను రెడీ.. కానీ మోదీ రారు: రాహుల్‌

న్యూఢిల్లీ, మే 18: వివిధ అంశాలపై బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ శనివారం మరోసారి ప్రధాని మోదీకి సవాలు విసిరారు. చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, కానీ ప్రఽధానే ముందుకు రాకపోవచ్చని అన్నారు.

ఢిల్లీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగిస్తూ ‘‘ప్రధాని కోరుకున్న సమయంలో కోరుకున్న చోట చర్చలకు రెడీ ఉన్నా. అయితే ఆయన వస్తారని అనుకుంటున్నారా? నాకు తెలుసు.. ఆయన రారు. ఎందుకంటే నేను అడిగే మొదటి ప్రశ్న..అదానీతో ఉన్న మీకున్న సంబంధం ఏమిటని? ఇది అడుగుతాను కాబట్టే ఆయనకు ఇష్టం ఉండదు’’ అని అన్నారు.

Updated Date - May 19 , 2024 | 04:26 AM