Rahul Gandhi: డొనాల్డ్ ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:54 PM
అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కు రాహుల్ గాంధీ లేఖ రాశారు.
ఢిల్లీ: ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కు లేఖ రాశారు. ఆయన విజయంపై అభినందనలు తెలిపారు. ఈ సారి ఎన్నికల ఫలితాల తర్వాత పదవీవిరమణ చేయనున్న ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కూడా ఆయన లేఖ రాశారు.
తన లేఖలో కాంగ్రెస్ నాయకుడు రిపబ్లికన్లు గెలిచినందుకు అభినందించారు. భారతీయులు, అమెరికన్లు కలిసి పని చేస్తే పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో సహకారాన్ని మరింత పెంపొందించుకోవచ్చి ఆశాభావం వ్యక్తం చేశారు.
"అమెరికా 47వ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను. భవిష్యత్తు కోసం మీ విజన్‌పై ప్రజలు విశ్వాసం ఉంచారు" అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు. "ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధతతో భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చారిత్రక స్నేహాన్ని కొనసాగిస్తున్నాయి. మీ నాయకత్వంలో, పరస్పర ఆసక్తి ఉన్న రంగాలలో మా దేశాలు సహకారాన్ని మరింతగా పెంచుకుంటాయని మేము విశ్వసిస్తున్నాము" అని రాహుల్ గాంధీ తెలిపారు.
"భారతీయులు, అమెరికన్లు ఇద్దరికీ మార్గాలు, అవకాశాలను విస్తరించే దిశగా మేము పని చేస్తూనే ఉంటామని నేను ఆశిస్తున్నాను" అని రాహుల్ తెలిపారు. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
కమలా హారిస్‌కు రాహుల్ లేఖ..
పదవీ విరమణ చేసిన ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌కు కూడా రాహుల్ గాంధీ లేఖ రాశారు. "ఎంతో ఉత్సాహంతో అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నందుకు నేను మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను. మీ ఐక్యంగా ఉండాలనే మీ సందేశం చాలా మందికి స్ఫూర్తినిస్తుంది" అని ప్రతిపక్ష నాయకుడు కమలా హారిస్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.
"బైడెన్ పరిపాలనలో, భారతదేశం, యునైటెడ్ స్టేట్స్ ప్రపంచ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై సహకారాన్ని మరింతగా పెంచుకున్నాయి. ప్రజాస్వామ్య విలువల పట్ల మా భాగస్వామ్య నిబద్ధత మా స్నేహానికి మార్గదర్శకంగా కొనసాగుతుంది. ఉపాధ్యక్షుడిగా, ప్రజలను ఒకచోట చేర్చి, ఉమ్మడిగా ఉండాలనే మీ సంకల్పం గుర్తుంచుకోవాలి' అని రాహుల్ గాంధీ అన్నారు.