Share News

Yogi Adityanath: రాహుల్‌కు ఇప్పటికీ పరిపక్వత రాలేదు: యోగి

ABN , Publish Date - Jul 01 , 2024 | 07:50 PM

హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. రాహుల్ అపరిపక్వ నేత అని అభివర్ణించారు.

Yogi Adityanath:  రాహుల్‌కు ఇప్పటికీ పరిపక్వత రాలేదు: యోగి

న్యూఢిల్లీ: హిందువులుగా చెప్పుకునే వారు హింసను, ద్వేషాన్ని, అసత్యాలను ప్రచారం చేస్తున్నారంటూ రాహుల్ గాంధీ లోక్‌సభలో చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ఘాటుగా స్పందించారు. రాహుల్ అపరిపక్వ (immature) నేత అని అభివర్ణించారు. లోక్‌సభలో విపక్ష నేత అయిన తర్వాత అయినా ఆయనలో పరిపక్వత వస్తుందని తాము ఆశించామని, అయితే అలాంటిదేమీ లేదన్నారు. అపరిపక్వ నేత మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని అన్నారు. ఆయన తన వ్యాఖ్యలకు కాను దేశప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. హిందూ అనేది మన దేశ ఆత్మ అని యోగి ఆదిత్య నాథ్ అన్నారు.

Ashwini Vaishnaw: రాహుల్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం


లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గొప్ప నేతలంతా అహింస గురించి మాట్లాడారు కానీ ఇప్పుడు హిందువులని చెప్పుకునే వాళ్లు హింస, ద్వేషం, అబద్ధాలు మాట్లాడుతున్నారని అన్నారు. ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా పేర్కొనడం ఆమోదనీయం కాదని అన్నారు. అయితే, తాను బీజేపీని, ఆర్ఎస్‌ఎస్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశానని, ఆ పార్టీ, ఆర్ఎస్ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్ ప్రతిస్పందించారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అంహిస సందేశాలను చాటి చెబుతున్నాయని అన్నారు.

For More National News and Latest Telugu News click here

Updated Date - Jul 01 , 2024 | 07:51 PM