Mumbai: సావర్కర్‌ని రాహుల్ అవమానిస్తున్నారు.. మండిపడ్డ స్వాతంత్య్ర యోధుడి మనుమడు
ABN , Publish Date - Mar 18 , 2024 | 06:26 AM
జాతీయ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఖండించారు. రాహుల్ రాజకీయ లబ్ది కోసం కాషాయ సిద్ధాంతకర్తని పదేపదే దూషిస్తున్నారని అన్నారు.
ముంబై: జాతీయ కవి, స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్ దామోదర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ఖండించారు. రాహుల్ రాజకీయ లబ్ది కోసం కాషాయ సిద్ధాంతకర్తని పదేపదే దూషిస్తున్నారని అన్నారు.
రంజిత్ మాట్లాడుతూ.. “ఇది కాంగ్రెస్‌కు ముందు నుంచి ఉన్న అలవాటే. సావర్కర్‌ను అవమానించినందుకు రాహుల్ గాంధీని బూట్లతో కొట్టాలని 2019 లో ఉద్ధవ్ థాక్రే అన్నట్లు నాకు గుర్తుంది. రాహుల్ ఇప్పటికీ మా తాతపై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆయన వ్యాఖ్యలపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిపోతోంది. ఇండియా కూటమిలోని నేతలు సైతం రాహుల్ వ్యాఖ్యలను సమర్థించట్లేదు. బూట్లతో కొట్టాలన్న వారే ఇప్పుడు రాహుల్‌తో నిలబడి ఉన్నారు. సావర్కర్‌ని అవమానిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు" అని రంజిత్ వ్యాఖ్యానించారు. గత ఏడాది జరిగిన 'భారత్ జోడో యాత్ర'లో రాహుల్ మాట్లాడుతూ.. సావర్కర్ బ్రిటిష్ పాలనలో జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలో, క్షమాభిక్ష కోసం వలస వాదులకు లేఖ రాశారని ఆరోపించారు.