Nitesh Rane: కేరళ మినీ పాకిస్థాన్... ఆందుకే వాళ్లిద్దరూ ఎంపీలయ్యారు
ABN , Publish Date - Dec 30 , 2024 | 02:57 PM
2019 రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి గెలిచి, అమేథీలో ఓడిపోయారు. తిరిగి 2024లో రాహుల్ వయనాడ్, రాయబరేలిలో గెలిచారు. వయనాడ్ సీటును ఆయన వదులుకోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా గెలిచారు.
ముంబై: బీజేపీ నేత, మహారాష్ట్ర మత్స్య శాఖ మంత్రి నితీష్ రాణే (Nitesh Rane) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళను "మినీ పాకిస్థాన్''గా ఆయన అభివర్ణించారు. లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), ఆయన సోదరి ప్రియాంక గాంధీ (Priyanka Gandhi) ఎన్నికల్లో గెలవడానికి కారణం అదేనని అన్నారు. రాణే వ్యాఖ్యలపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది.
Arvind Kejriwal: వేతనాల గురించి సీఎం కీలక ప్రకటన.. వీరికి గుడ్ న్యూస్..
''కేరళ మీనీ పాకిస్థాన్‌కు ఏమాత్రం తీసిపోదు. అందువల్లే అక్కడ రాహుల్, ఆయన సోదరి గెలిచారు. టెర్రరిస్టులంతా వారికి ఓటేశారు. నేను నిజమే మాట్లాడుతున్నారు. టెర్రరిస్టుల మద్దతుతోనే వీళ్లు ఎంపీలయ్యారు'' అని రాణే ఘాటుగా స్పందించారు. 2019 రాహుల్‌గాంధీ వయనాడ్ నుంచి గెలిచి, అమేథీలో ఓడిపోయారు. తిరిగి 2024లో రాహుల్ వయనాడ్, రాయబరేలిలో గెలిచారు. వయనాడ్ సీటును ఆయన వదులుకోవడంతో అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వాద్రా గెలిచారు.
కాగా, అప్ఘల్‌ఖాన్‌పై ఛత్రపతి శివాజీ చారిత్రక విజయం సాధించిన సందర్భాన్ని పురస్కరించుకుని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో రాణే తాజా వ్యాఖ్యలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత పవన్ ఖేర విమర్శలు గుప్పించారు. "కేరళ నుంచి వచ్చే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందో లేదో మీ (బీజేపీ) అధ్యక్షుడు జేపీ నడ్డాను అడగండి. రాజ్యాంగ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడం బీజేపీ నేతలకు బాగా అలవాటుగా మారింది'' అని వ్యాఖ్యానించారు. రాణే వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకుంటారో లేదో చెప్పాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌ను శరద్ పవార్ సారథ్యంలోని ఎన్‌సీపీ (ఎస్‌పీ) సైతం నిలదీసింది.
ఇవి కూడా చదవండి:
Prashant Kishore: పరీక్ష రద్దు చేయాలని విద్యార్థుల ఆందోళన.. కీలక నేత అరెస్ట్
Kumbh Mela 2025: మహా కుంభమేళాకు.. రూ.7,500 కోట్లు
Read More National News and Latest Telugu News