Rahul Gandi: రాజ్‌కోట్, మార్బీ మృతుల కుటుంబాలను పరామర్శించనున్న రాహుల్
ABN , Publish Date - Jul 05 , 2024 | 09:22 PM
ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను శుక్రవారంనాడు పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ శనివారంనాడు అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. రాజ్‌కోట్, మార్బీ మృతుల కుటుంబాలను పరామర్శించనున్నారు.
అహ్మదాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ జిల్లాలో ఇటీవల జరిగిన తొక్కిసలాటలో మృతుల కుటుంబాలను శుక్రవారంనాడు పరామర్శించిన కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) శనివారంనాడు అహ్మదాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇటీవల గుజరాత్ (Gujarat)లో చోటుచేసుకున్న వివిధ విషాద ఘటనల్లో బాధిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలపనున్నారు. రాజ్‌కోట్ గేమ్ జోన్ అగ్నిప్రమాదం, వడోదరలో పడవ బోల్తాపడిన ఘటన, మోర్బీ వంతెన కుప్పకూలిన ఘటనల్లో బాధిత కుటుంబాలను ఆయన కలుసుకుంటారు.
Bengal MLAs oath: వివాదాస్పదమైన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం.. కస్సుమన్న గవర్నర్
గుజరాత్‌లో రాహుల్ పర్యటనను ఆ పారీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ధ్రువీకరించారు. శనివారం మధ్యాహ్నం 12.30 గంటలకు జీపీసీసీ కార్యాలయానికి రాహుల్ చేరుకుంటారని, పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని, అనంతరం రాజ్‌కోట్ గోమ్ జోన్ అగ్నిప్రమాదం, ఇతర విషాధ ఘటనల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. గుజరాత్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యాలయం వెలుపల బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఇటీవల జరిగిన ఘర్షణలో అరెస్టయిన ఐదుగురు కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబాలను కూడా రాహుల్ కలుసుకుంటారని చెప్పారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ హిందూ వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ జీపీసీసీ కార్యాలయం వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చెలరేగి రాళ్లు రువ్వుకోవడంతో ఒక ఏసీపీ సహా ఐదుగురు పోలీసులు గాయపడ్డారు.