నైట్ డ్యూటీ కోసం రైల్వే ఉద్యోగుల డ్రామా
ABN , Publish Date - Sep 24 , 2024 | 03:36 AM
ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో రైలు పట్టాల బోల్టులు, ఫిష్ ప్లేట్లు తొలగించిన ఘటనలో రైల్వే ఉద్యోగులే నిందితులని తేలింది.
ఫిష్ ప్లేట్లు తొలగించిన ఘటనలో ముగ్గురి అరెస్టు
సూరత్, సెప్టెంబరు 23: ఇటీవల గుజరాత్‌లోని సూరత్‌లో రైలు పట్టాల బోల్టులు, ఫిష్ ప్లేట్లు తొలగించిన ఘటనలో రైల్వే ఉద్యోగులే నిందితులని తేలింది. వారే ట్యాంపరింగ్‌కు పాల్పడి, వారే కుట్ర జరిగిందని పై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఈ ఘటనలో ట్రాక్‌మన్లుగా పనిచేస్తున్న సుభాశ్ పొద్దార్, మనీశ్ మిస్ర్తీ, శుభం జైస్వాల్ అనే ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. కుట్రను భగ్నం చేశామన్న ప్రశంస దక్కుంతుందనే దురుద్దేశంతోనే దుశ్చర్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అలా చేస్తే ముగియనున్న తమ నైట్ డ్యూటీలు పొడిగిస్తారని, అప్పుడు పగలంతా కుటంబంతో జాలీగా గడపొచ్చని నిందితులు భావించినట్లు ఓ పోలీసు ఉన్నతాధికారి తెలిపారు.