Share News

Rain Alert: మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

ABN , Publish Date - Oct 06 , 2024 | 08:05 PM

అక్టోబర్ వచ్చినా కూడా దేశవ్యాప్తంగా పలు చోట్ల ఇంకా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే రేపటి నుంచి పలు చోట్ల మళ్లీ వానలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఎక్కడెక్కడ ఈ వానలు ఉన్నాయనేది ఇక్కడ తెలుసుకుందాం.

Rain Alert: మరో రెండు రోజులు ఈ రాష్ట్రాల్లో వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
Rain alert october 7th 2024

దేశవ్యాప్తంగా రుతుపవనాలు వెనక్కి తగ్గినప్పటికీ ఇంకా పలు రాష్ట్రాల్లో(rains) మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే అక్టోబరు 7 నుంచి 11వ వరకు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అదే సమయంలో రేపు (అక్టోబర్ 7న) ఢిల్లీ, నోయిడా, ఫరీదాబాద్‌తో సహా NCRలోని వివిధ ప్రాంతాలలో చిరుజల్లులు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది.


వాయుగుండం

నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వెంబడి వాయుగుండం కొనసాగుతోందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో యూపీ, బీహార్ తదితర రాష్ట్రాల్లో దీని ప్రభావం కనిపిస్తుందని వెల్లడించింది. పంజాబ్‌లోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ ప్రభావం అక్టోబర్ 7, 8 తేదీల్లో యూపీ, బీహార్‌లోని కొన్ని జిల్లాల్లో కనిపిస్తుందని ఐఎండీ వెల్లడించింది.


కేరళతోపాటు

దీంతోపాటు అక్టోబర్ 7 నుంచి 10 మధ్య ఆగ్నేయ అరేబియా సముద్రం మీదుగా కేరళ తీరం చుట్టూ, లక్షద్వీప్, గల్ఫ్ ఆఫ్ మన్నార్, కర్ణాటక ప్రాంతాల్లో కూడా వర్షాలు కురియనున్నట్లు వెదర్ రిపోర్ట్ తెలిపింది. నైరుతి బే, ఉత్తర బెంగాల్, తమిళనాడు తీరానికి సమీపంలో బలమైన గాలులు వీస్తాయని చెప్పింది. ఇది కాకుండా గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో రాబోయే రెండు రోజుల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఈ ప్రాంతాల్లో కూడా..

వాతావరణ శాఖ వెబ్‌సైట్ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్‌లోని వివిధ ప్రాంతాల్లో రాబోయే 6 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. దీంతో పాటు అస్సాం, మేఘాలయలో కూడా భారీ వర్షాలు కురుస్తాయి. అదే సమయంలో అక్టోబర్ 7న నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో కూడా వర్షాలు కురిస్తాయని వెదర్ రిపోర్ట్ ప్రకటించింది.


తెలుగు రాష్ట్రాల్లో

ఇదే సమయంలో బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడన ద్రోణులు ఏర్పడుతున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలో వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురియనున్నట్లు అంచనా వేసింది. ఇక తెలంగాణలో సైతం వచ్చే రెండు రోజులు వానలు కురుస్తాయని ఐఎండీ చెప్పింది. హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో అక్టోబర్ 9 వరకు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వెదర్ రిపోర్ట్ అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి:

India vs Pakistan: పాకిస్తాన్‌పై ఉమెన్స్ టీమిండియా గ్రాండ్ విక్టరీ..సెమీస్ ఆశలు సజీవం


Viral Video: కిమ్ జోంగ్, సోరేస్‌తో డిన్నర్ గురించి జైశంకర్‌కు ప్రశ్న.. షాకింగ్ అన్సార్


IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: పండుగల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరకే ప్రసిద్ధ ఆలయాల సందర్శన


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 06 , 2024 | 08:10 PM