Share News

Rajasthan: సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు.. రూ1,140 కోట్లు నష్టం జరిగిందంటూ ధ్వజం

ABN , Publish Date - May 17 , 2024 | 09:44 PM

సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్‌లోని ఓ మంత్రి మాత్రం సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది.

Rajasthan: సొంత ప్రభుత్వంపై బీజేపీ మంత్రి తీవ్ర ఆరోపణలు.. రూ1,140 కోట్లు నష్టం జరిగిందంటూ ధ్వజం

జైపుర్: సాధారణంగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు గుప్పిస్తుంటాయి. కానీ రాజస్థాన్‌లోని ఓ మంత్రి మాత్రం సొంత పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రభుత్వానికి చెందిన ఓ ప్రాజెక్టులో రూ.1,140 కోట్ల నష్టం జరిగిందని ఆయన మీడియా ముఖంగా చెప్పడం చర్చనీయాంశం అవుతోంది. ఆ ప్రాజెక్ట్‌ను నిలిపివేయాలని, ప్రతిపాదిత ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చిన 6 నెలలే అయింది.

ఈ క్రమంలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలు జరగడం చర్చనీయాంశం అవుతోంది. సీఎం భజన్‌లాల్ శర్మ నిర్వహిస్తున్న హౌసింగ్ శాఖ ప్రాజెక్ట్‌లో లోపాలపై వ్యవసాయ మంత్రి కిరోడి లాల్ మీనా ధ్వజమెత్తారు. గాంధీనగర్‌లో చేపట్టనున్న హౌసింగ్‌ ప్రాజెక్టు వల్ల ప్రభుత్వానికి రూ. 1,146 కోట్ల నష్టం వాటిల్లుతోందని అన్నారు.


ఆ ప్రాంతంలో భూమి మార్కెట్ విలువను తక్కువగా పేర్కొనడం దీనికి కారణమని ఆరోపించారు. సీఎం ఆధ్వర్యంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ), కేబినెట్ క్లియరెన్స్ లేకుండా ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్తున్నారని మంత్రి మీనా ఆరోపించారు. ప్రాజెక్ట్‌ను వెంటనే నిలిపేయాలని, ఆ ఫైల్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. సీఎం భజన్‌లాల్ శర్మకు ఈ మేరకు ఆయన లేఖ రాశారు. సీఎం ఎలా స్పందిస్తారోనని ఆసక్తికరంగా మారింది.

గతంలోనూ విమర్శలు..

సొంత ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై మీనా అభ్యంతరం తెలపడం ఇది మొదటిసారేం కాదు. ఏప్రిల్‌లోనూ రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్ కింద విక్రయించిన భూమికి సంబంధించి అవినీతి జరిగిందని ఆరోపించారు. మంత్రి ఆరోపణలపై విచారణకు ఆదేశించిన భజన్ లాల్ అక్రమార్కులపై చర్యలు చేపట్టారు.

For More National News and Telugu News..

Updated Date - May 17 , 2024 | 09:44 PM