Share News

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

ABN , Publish Date - Dec 13 , 2024 | 02:51 PM

భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ ఈ చర్చను ప్రారంభించారు.

Rajnath Singh: రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదు: రాజ్‌నాథ్ సింగ్

న్యూఢిల్లీ: రాజ్యాంగం (Constitution) ఏక పార్టీ కృషి కాదని కాంగ్రెస్‌ను ఉద్దేశించి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అన్నారు. ఒక పార్టీ రాజ్యాంగాన్ని హైజాక్ చేసేందుకు ప్రత్నించిందని విమర్శించారు. భారత రాజ్యాంగం ఏక పార్టీ కృషి కాదని స్పష్టం చేశారు. భారత రాజ్యాంగాన్ని ఆమోదించి 75వ పడిలోకి అడుగుపెట్టిన సందర్భంగా పార్లమెంటులో ప్రత్యేక చర్య జరిగింది. ప్రభుత్వం తరఫున రాజ్‌నాథ్ సింగ్ ఈ చర్చను ప్రారంభించారు.

Gurugram Blast: గురుగ్రామ్‌లో బాంబు పేలుడు.. సంచలన ప్రకటన చేసిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్..


''భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న ఆమోదించారు. రాజ్యాంగాన్ని ఆమోదించి 75 ఏళ్లు అయిన సందర్భంగా ఈ సభకు, దేశ ప్రజలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక జీవనానికి సంబంధించిన అన్ని కోణాలను స్పృశిస్తూ జాతి నిర్మాణానికి రాజ్యాంగం మార్గం ఏర్పరిచిందని చెప్పగలను. భారతదేశ సమున్నత విలువలకు అనుగుణంగా దేశ ప్రజలు రాజ్యాంగ నిర్మాణం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని మా ప్రభుత్వం సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్, సబ్‌కాస్ విశ్వాస్, సబ్‌కా ప్రయాస్ స్ఫూర్తితో, భారత రాజ్యాంగంలో రాసిన ధర్మానికి అనుగుణంగా పని చేస్తోంది. ప్రగతిశీల, ఇన్‌క్లూజివ్, ట్రాన్స్‌పర్మేటివ్ రాజ్యాంగం మనది. పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తి కూడా దేశ ప్రధాని కావచ్చు, రాష్ట్రపతి కావచ్చు'' అని రాజ్‌నాథ్ తన చర్చలో పేర్కొన్నారు.


పోస్ట్‌కలోనియల్ డెమెక్రసీలు, వారి రాజ్యాంగాలు ఎంతోకాలం మనలేదని, కానీ భరత రాజ్యంగం ఎన్ని సవాళ్లు ఎదురైనా మౌలిక స్ఫూర్తిని కోల్పోకుండా ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యంగా కీలక భూమిక పోషిస్తోందని రాజ్‌నాథ్ అన్నారు. రాజ్యాంగ కస్టోడియన్‌గా సుప్రీంకోర్టు పాత్రను అంతా అంగీకరిస్తున్నామని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణ అనే మాట ఇవాళ వినిపిస్తోందని, అది అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఎవరు రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నారు, ఎవరు గౌరవించడం లేదనే విషయాన్ని కూడా మనం అవగతం చేసుకోవాల్సిన అవసరం కూడా ఉందన్నారు.


ఇది కూడా చదవండి..

Mumbai: షిర్డీ ఆలయ భద్రతపై మాక్‌ డ్రిల్‌

Sadhguru: సంపద సృష్టికర్తలను వివాదాల్లోకి లాగొద్దు

For National news And Telugu News

Updated Date - Dec 13 , 2024 | 03:01 PM