Ayodhya: రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా రాజ్నాథ్ సింగ్ ప్రార్థనలు
ABN , Publish Date - Jan 22 , 2024 | 11:52 AM
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు.
అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా దేశం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది. రామనామ స్మరణతో దేశం మార్మోగిపోతోంది. ఇతర దేశాల్లోనూ రామ ప్రతిష్ఠ సంబురాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని దర్యా గంజ్లో గల శ్రీ సనాతన్ ధర్మ్ మందిర్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రార్థనలు చేశారు. ఆంజనేయస్వామికి పూజలు చేసి, పూలమాలలు సమర్పించారు. మరోవైపు రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొనడానికి ఆహ్వానం అందిన ప్రముఖులంతా అయోధ్యకు చేరుకుంటున్నారు.
ఇప్పటికే బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ప్రముఖ నటులు చిరంజీవి, రామ్ చరణ్, రజనీకాంత్ తదితరులు అయోధ్యకు చేరుకున్నారు. ఒక వైపు బాల రాముడి ప్రాణప్రతిష్ఠ మరోవైపు ప్రముఖుల రాకతో అయోధ్యలో సందడి వాతావరణం నెలకొంది. అయోధ్యలోని ఇతరత్రా ఆలయాలను కూడా ప్రముఖులు దర్శించుకుంటున్నారు. అలాగే రామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా దేశ వ్యాప్తంగా భక్తుల రద్దీతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పొటెత్తారు. సీతారాముల వారికి పూజలు చేస్తున్నారు. కాగా అయోధ్య ప్రాణప్రతిష్ఠ దివ్య ముహూర్తం 84 సెకండ్లపాటు కొనసాగనుంది. మధ్యాహ్నం 12:29:03 గంటల నుంచి 12:30:35 వరకు కొనసాగనుంది. ఈ సమయంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు.