Share News

Bharat Bandh: భారత్ బంద్ ను విజయవంతం చేయండి.. రాకేష్ టికాయత్ పిలుపు..

ABN , Publish Date - Jan 24 , 2024 | 06:08 PM

రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 16న భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు.

Bharat Bandh: భారత్ బంద్ ను విజయవంతం చేయండి.. రాకేష్ టికాయత్ పిలుపు..

రైతు సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఫిబ్రవరి 16న భారత్ బంద్‌ను పాటించనున్నట్లు రైతు సంఘం నాయకుడు రాకేష్ టికాయత్ ప్రకటించారు. పంటలకు గరిష్ఠ మద్దతు ధర కల్పించే చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో పాటు వ్యాపారులు సైతం తమ నిర్ణయానికి మద్దతు ఇవ్వాలని కోరారు. భారత్ బంద్ లో సంయుక్త కిసాన్ మోర్చా తో సహా అనేక రైతు సంఘాలు పాల్గొననున్నాయి. రైతులు కూడా ఆ రోజు పొలాలకు వెళ్లకూడదని కోరారు.

ఎంఎస్‌పి హామీ చట్టం, నిరుద్యోగం, అగ్నివీర్ పథకం, పెన్షన్ స్కీమ్‌లు వంటి వాటితో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రాకేష్ టికాయత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దుకాణదారులు మాత్రం షాపులు తెరిచి రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఇది రైతుల సమ్మె మాత్రమే కాదని.. ఈ సమ్మెలో ఇతర సంస్థలు కూడా పాల్గొంటాయని చెప్పారు. ఈ సమ్మె ద్వారా ప్రభుత్వానికి గట్టి సందేశం పంపాలని కోరారు.

మరిన్ని జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 06:09 PM