Share News

Ram Rahim: డేరాబాబా మళ్లీ బయటకు... 4 ఏళ్లలో 15వ పెరోల్

ABN , Publish Date - Oct 01 , 2024 | 06:01 PM

హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ డేరాబాబా పెరోల్‌పై బయటకు రానున్నారు. పెరోల్ కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ ఆమోదించింది.

Ram Rahim: డేరాబాబా మళ్లీ బయటకు... 4 ఏళ్లలో 15వ పెరోల్

చండీగఢ్: ఇద్దరు మహిళా భక్తులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా నేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ (Gurmeet Ram Rahim Singh) మరోసారి జైలు నుంచి బయటకు వస్తున్నారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ ఆయన పెరోల్‌పై బయటకు వస్తుండడం విశేషంగా మారింది. పెరోల్ కోరుతూ ఆయన చేసుకున్న విజ్ఞప్తిని భారత ఎన్నికల కమిషన్ సోమవారం ఆమోదించింది. గత తొమ్మిది నెలల్లో ఆయన పెరోల్‌పై జైలు బయటకు రానుండటం ఇది మూడవసారి. కాగా నాలుగేళ్ల క్రితం దోషిగా తేలిన తర్వాత పెరోల్ పొందడం పదిహేనవది.

MUDA Case: రాజకీయ కుట్రల బాధితురాలు నా భార్య: సిద్ధరామయ్య


అక్టోబర్ 5న హర్యానా అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా, గతంలోని మున్సిపల్, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెరోల్‌పై డేరాబాబా విడుదలైన సందర్భాలున్నాయి. ఈసారి కూడా ఎన్నికలకు ఆయన విడుదలవుతున్నందున కొన్ని షరతులతో తాత్కాలిక విడుదలకు ఈసీ అంగీకరించింది. హర్యానాలో అడుగుపెట్టరాదని, ఎన్నికలకు సంబంధించిన ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనరాదని ఆంక్షలు విధించింది. గత ఆగస్టులోనూ 23 రోజులు పెరోల్‌తో డేరాబాబా జైలు బయటకు వచ్చారు. తిరిగి సెప్టెంబర్ 2న సునరియా జైలుకు తిరిగి వెళ్లారు.


మరిన్ని జాతీయ వార్తల కోసం

ఈ వార్తలు కూడా చదవండి..

శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయంలో అద్భుతం..

Updated Date - Oct 01 , 2024 | 06:18 PM