Ramdas: అన్నాడీఎంకేకు ఊపిరి పోసింది మేమే..
ABN , Publish Date - Apr 02 , 2024 | 11:28 AM
పీఎంకే తమకు ద్రోహం చేసిందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఈపీఎస్ చేసిన వ్యాఖ్యలకు పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్(Dr. Anbumani Ramdas) దీటుగా కౌంటరిచ్చారు.
- పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రాందాస్
చెన్నై: పీఎంకే తమకు ద్రోహం చేసిందంటూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం ఈపీఎస్ చేసిన వ్యాఖ్యలకు పీఎంకే అధ్యక్షుడు డాక్టర్ అన్బుమణి రాందాస్(Dr. Anbumani Ramdas) దీటుగా కౌంటరిచ్చారు. చనిపోతున్న అన్నాడీఎంకేకు ఆక్సిజన్‌లా ఊపిరి పోసింది పీఎంకే అని చెప్పారు. కొళత్తూరులో ఆయన ఎన్నికల ప్రచారం సాగించారు. అన్నాడీఎంకే కష్టాల్లో చిక్కుకున్న ప్రతిసారీ పీఎంకే ప్రాణవాయువులా పని చేసిందన్నారు. అవినీతి కేసులో జయకు జైలు శిక్ష పడినపుడు ఇక అన్నాడీఎంకే పని అయిపోయిందని ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానించారన్నారు. రెండేళ్ళ తర్వాత జరిగిన ఎన్నికల్లో పీఎంకేతో అన్నాడీఎంకే పొత్తు పెట్టుకుని 39 లోక్‌సభ స్థానాల్లో ఏకంగా 30 గెలిచిందని గుర్తు చేశారు. 2019లో తమ పార్టీ అండ లేకుంటే ఎడప్పాడి పళనిస్వామి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొనేవారా అని ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో 22 స్థానాలకు గాను 9 స్థానాల్లో అన్నాడీఎంకే విజయం సాధించగా, అందులో 5 సీట్లలో పీఎంకే ఓటర్ల కారణంగా గెలుచుకున్నారని తెలిపారు.
ఇదికూడా చదవండి: MP Kanimozhi: ఎంపీ కనిమొళి అంతమాట అనేశారేంటో.. మోదీకి తమిళం నేర్పేందుకు టీచర్‌ను పంపిస్తాం..