Share News

Reasi bus terror attack: అదుపులో 30 మంది అనుమానితులు

ABN , Publish Date - Jun 13 , 2024 | 08:36 PM

రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ కేసుతో సంబంధమున్నట్లు భావిస్తున్న 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని జమ్ము కశ్మీర్ పోలీసులు వెల్లడించారు.

 Reasi bus terror attack: అదుపులో 30 మంది అనుమానితులు

జమ్ముకశ్మీర్, జూన్ 13: రియాసీ జిల్లాలో యాత్రికులతో వెళ్తున్న బస్సు‌పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడితో సంబంధమున్నట్లు భావిస్తున్న 50 మంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని జమ్ము కశ్మీర్ పోలీస్ ఉన్నతాధికారులు గురువారం వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి తమతోపాటు భద్రతా దళాలకు కీలక సమాచారం అందడంతో.. వారిని అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. ఇక ఈ దాడి నేపథ్యంలో ఉగ్రవాదుల ప్రాబల్యమున్న అర్నాస్, మహరో ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు.

Also Read: Amaravathi: దటీజ్ చంద్రబాబు.. మాట నిలబెట్టుకునే నైజం

అందులోభాగంగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. మరోవైపు మారుమూల ప్రాంతాల్లో సైతం ఉగ్రవాదులు నక్కి ఉండవచ్చని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. వారి కోసం ముమ్మర గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వారు స్పష్టం చేశారు.

Also Read: Mumbai: రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన సునేత్ర


మరోవైపు దోడా జిల్లాలో దాడికి పాల్పడిన నలుగురు ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. వీరి ఆచూకీ తెలిపితే రూ.20 లక్షలు రివార్డ్ అందజేస్తామని పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు. ఇంకోవైపు భద్రతా దళాలపై ఉగ్రదాడులు జరిగే అవకాశాలున్నాయని నిఘా సంస్థలు హెచ్చరించాయని తెలిపారు. అలాగే భద్రత దళాలు క్యాంప్‌లపై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశాలున్నాయన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని భద్రత దళాలకు సూచించినట్లు వివరించారు.

Also Read: Delhi Water Crisis: ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

జూన్ 9వ తేదీ... అంటే ఆదివారం సాయంత్రం జమ్ము కశ్మీర్‌లోని శివ్‌ఖోడి ఆలయాన్ని సందర్శించుకొని వస్తున్న యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు విచక్షణ రహితంగా కాల్పులకు తెగబడ్డారు. దాంతో డ్రైవర్ బస్సు వేగం పెంచడంతో.. లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు.

Also Read: Mumbai: ఐస్‌క్రీమ్‌లో చేతి వేలు... పోలీసులను ఆశ్రయించిన డాక్టర్


అలాగే 41 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ బస్సులో ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన యాత్రికులు ఉన్నారు. అయితే సరిగ్గా అదే సమయంలో దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రధానిగా మోదీతో పాటు ఆయన మంత్రి వర్గం ప్రమాణ స్వీకారం చేస్తుంది. ఇక ఈ ప్రమాద ఘటనపై ఆరా తీసిన ప్రధాని మోదీ.. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే ఈ దాడికి పాల్పడిన వారిని విడిచి పెట్టవద్దంటూ.. ఉన్నతాధికారులకు మోదీ సూచించారు.

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 13 , 2024 | 08:41 PM