Arvind Kejriwal: సుప్రీంలో కేజ్రీవాల్‌కు బెయిల్
ABN , Publish Date - Jul 12 , 2024 | 11:01 AM
సుప్రీంకోర్టులో కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ: సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు ఊరట లభించింది. ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేస్తూ తీర్పును వెలువరించింది. ఢిల్లీ లిక్కర్ ఈడీ మనీలాండరింగ్ కేసులో ఆయనకు ధర్మాసనం మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఢిల్లీ లిక్కర్ కేసులో తన అరెస్ట్ అక్రమం అని కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసినట్టు జస్టిస్ సంజీవ్ కన్నా ధర్మాసనం తెలిపింది. గత నెల 27వ తేదీన ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తిహార్ జైల్లో కేజ్రీవాల్ ఉన్నారు.
ఢిల్లీ మద్యం విధానం మనీలాండరింగ్ కేసులో ఏప్రిల్ 9న ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాలు చేశారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్త నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపింది. కేజ్రీవాల్, ఈడీ వాదనల అనంతరం మే 17న తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది. ఆ తరవాత జూన్ 20న కేజ్రీవాల్‌కి రౌస్ అవెన్యూ కోర్టు సాధారణ బెయిల్ మంజూరు చేయగా... మరుసటి రోజే ఢిల్లీ హైకోర్టు స్టే ఇచ్చింది.
Arakuloya : బొర్రా గుహలకు ముప్పు!