Share News

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై తీర్మానం

ABN , Publish Date - Oct 19 , 2024 | 03:03 AM

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో తీర్మానం ఆమోదించారు.

జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాపై తీర్మానం

శ్రీనగర్‌, అక్టోబరు 18: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలంటూ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా నేతృత్వంలో జరిగిన తొలి కేబినెట్‌ సమావేశంలో తీర్మానం ఆమోదించారు. ఒకటి రెండు రోజుల్లో సీఎం ఒమర్‌ అబ్దుల్లా ఢిల్లీకి వెళ్లి ఈ తీర్మానం ముసాయిదాను ప్రఽధాని మోదీకి అందజేస్తారు. మరోవైపు ఈ తీర్మానం ఆర్టికల్‌ 370 రద్దును ధ్రువీకరించడమేనని పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ ప్రతినిధి వహీదా పారా అభిప్రాయపడ్డారు. ఆర్టికల్‌ 370ని పునరుద్ధరిస్తామంటూ ఓట్లు దండుకుని ఇప్పుడు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బీజేపీ కూడా ఒమర్‌ తీర్మానంపై విమర్శలు ఎక్కుపెట్టింది. తీర్మానాన్ని రాజకీయ స్టంట్‌గా అభివర్ణించింది. సరైన సమయంలో జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పిస్తామని మోదీ ఇప్పటికే స్పష్టం చేశారని బీజేపీ అధికార ప్రతినిధి సునీల్‌ సేథీ గుర్తు చేశారు.

Updated Date - Oct 19 , 2024 | 03:03 AM