Share News

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

ABN , Publish Date - Dec 17 , 2024 | 09:59 AM

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.

Pollution: ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 పై ఆంక్షలు..

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో చలికి తోడు కాలుష్యం (Pollution) పెరిగింది. దీంతో కాలుష్యంపై ఢిల్లీ ప్రభుత్వం (Delhi Govt.) మరోసారి చర్యలు చేపట్టింది. మంగళవారం నుంచి ఢిల్లీలో మరోసారి గ్రాఫ్ 4 (Graph 4)పై ఆంక్షలను విధించినట్లు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ మేనేజ్‌మెంట్ (Air Quality Index Management) వెల్లడించింది. డీజిల్ వాహనాలపై ఆంక్షలు విధించారు. ఢిల్లీలోని కాలుష్యంపై సుప్రీంకోర్టులో డిసెంబర్ 19వ తేదిన మరోసారి విచారణ జరగనుంది.

ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్‌లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది. గాలి నాణ్యత సున్నా నుంచి 50 మధ్య ఉంటే బాగా ఉన్నట్టు అర్ధం. 51 నుంచి 100 వరకు ఉంటే సంతృప్తికరమైనదని, 101 నుంచి 200 వరకు ఉంటే మితమైన నాణ్యత, 201 నుంచి 300 ఉంటే తక్కువ నాణ్యత అని, 301 నుంచి 400 వరకు ఉంటే చాలా పేలవమైనదని, 401 నుంచి 500 ఉంటే ప్రమాదకరస్థాయిగా పరిగణిస్తారు.


కాగా ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టులో సోమవారం (డిసెంబర్ 2వ తేదీ) మరోసారి విచారణ జరిగింది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) తగ్గే వరకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్-4 (GRAP-4) నిబంధనలు సడలించొద్దని జస్టిస్‌ అభయ్ ఎస్ ఓకా, అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాలుగో దశ గ్రాఫ్‌లో ఆంక్షలు సడలించే ముందు కాలుష్యాన్ని తగ్గించాలని సూచించింది.

వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు అమలు చేసిన జీఆర్ఏపీ4 అమలులో నిర్లక్ష్యం చేస్తున్నారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఆంక్షలను అమలు చేయడానికి, ముఖ్యంగా ఢిల్లీలోకి ట్రక్కులు ప్రవేశించకుండా నిరోధించడానికి ఎంత మంది అధికారులను నియమించారని ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ విషయంలో జీఆర్ఏపీ4 పరిమితులను పాటించలేదనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తామని ఢిల్లీ ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. కేవలం రెండు మూడు ఘటనలను బట్టి చూస్తే1.5 కోట్ల జనాభా ఉన్న నగరం మొత్తం నిబంధనలు పాటించడం లేదని చెప్పలేమని ఢిల్లీ ప్రభుత్వం తరపున హాజరైన సీనియర్ న్యాయవాది షాదన్ ఫరాసత్ (Shadhan Farasath) తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అధికారులకు సంబంధం లేదు.. పూర్తి బాధ్యత నాదే: కేటీఆర్

ఆమె కోసం ప్రత్యేకమైన అంబులెన్స్.. వైద్య సిబ్బంది..

కాలంతో పరుగు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 17 , 2024 | 09:59 AM