Home » Air Pollution
రాష్ట్ర ప్రభుత్వం వాహనాదారులకు షాకిచ్చింది. పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అందుకు గల కారణాలు ఏంటి అంటే..
దేశ రాజధాని ఢిల్లీలో చాలా నెలల తర్వాత గాలి నాణ్యత మెరుగుపడింది. మూడేళ్ల తర్వాత నిన్న కాలుష్య స్థాయి తగ్గిపోయి, గాలి నాణ్యత పెరిగింది. అయితే ఏ మేరకు తగ్గిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
ఉత్తరాది రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పడిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీ, జమ్ము కశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో చలి తీవ్రత పెరిగింది. ఢిల్లీలో ఈ సీజన్లో అత్యంత శీతల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చలికి తోడు ఢిల్లీలో వాయు కాలుష్యం అధ్వాన స్థితిలోనే కొనసాగుతోంది.
ఢిల్లీలో కాలుష్యం తగ్గిన నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆంక్షలను తగ్గించేందుకు అనుమతి ఇస్తూనే, తదుపరి పర్యవేక్షణ అవసరమని కోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో స్కూళ్లు ఫిజికల్ విధానంలో మళ్లీ ప్రారంభించాలని తెలిపింది.
భారతదేశం రూ.22 లక్షల కోట్లు విలువచేసే శిలాజ ఇంధనాలను దిగుమతి చేసుకుంటోందని, ఆర్థిక, పర్యావరణ, జీవావరణ పరంగా ఇదొక సవాలని గడ్కరి చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాలను ప్రోత్సహించడం ద్వారా శిలాజ ఇంధనాల దిగుమతిని తగ్గించవచ్చని అన్నారు.
రాజధాని హైదరాబాద్ నగరాన్ని వాయు కాలుష్య బూచి వణికిస్తోంది. పెరుగుతున్న చలి, పొగమంచు, కాలుష్యంతో గాలి నాణ్యత పడిపోతూ డేంజర్ బెల్స్ మోగుతున్నాయి.
మరికొద్ది రోజుల్లో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయని, వాయు కాలుష్య సంక్షోభంపై సమగ్రంగా చర్చించాల్సిన బాధ్యత ఎంపీలపై ఉందని రాహుల్ అన్నారు. దేశం ఎదుర్కొంటున్న ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కనుగొనాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ట్రక్కులు, ఢిల్లీ వెలుపల రిజిస్టర్ అయిన వాయినాల ప్రవేశం నిలిపివేతపై చర్యలు సంతృప్తిగా లేవని, ఎన్ని ఎంట్రీ పాయింట్లు ఉన్నాయి, ఎన్ని టీమ్లు పనిచేస్తున్నాయనే దానిపై ఢిల్లీ ప్రభుత్వం ఇంతకుముందు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని ధర్మాసనం పేర్కొంది. వాహనాల ఆంక్షలకు సంబంధించిన క్లాజ్ 1, క్లాజ్ 2 అమలులో ఢిల్లీ ప్రభుత్వం, పోలీసులు విఫలమయ్యారని ఆక్షేపణ తెలిపింది.
ఢిల్లీతోపాటు దాని పరిధిలోని ప్రజలకు కాస్తా ఉపశమనం లభించింది. బుధవారం "తీవ్రమైన ప్లస్" కేటగిరీ కింద నమోదైన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఈరోజు స్వల్పంగా మెరుగుపడింది. అయితే ఏ మేరకు తగ్గింది, ఎంత స్థాయిలో ఉందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.