Share News

IRDAI: రూ.80 వేల కోట్ల పరిహారం పెండింగ్.. 10.46 లక్షల మంది నిరీక్షణ

ABN , Publish Date - May 26 , 2024 | 05:55 PM

దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్‌లు(Mishap Claims) సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో స్పష్టత కోరుతూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు.

IRDAI: రూ.80 వేల కోట్ల పరిహారం పెండింగ్.. 10.46 లక్షల మంది నిరీక్షణ

ఢిల్లీ: దేశవ్యాప్తంగా నిత్యం ఏదో ఓ చోట రహదారులు నెత్తురోడుతూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ఖేరి వద్ద ఆగి ఉన్న బస్సును ట్రక్కు ఢీ కొట్టడంతో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడ్డారు. ఇలా నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. బాధితులకు అందజేసే ప్రమాద క్లెయిమ్‌లు(Mishap Claims) సమయానికి అందుతున్నాయా లేదా అనే విషయంలో స్పష్టత కోరుతూ ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు న్యాయవాది కేసీ జైన్ ఆర్టీఐకి దరఖాస్తు చేశారు.

దేశంలో పెండింగ్‌లో ఉన్న మొత్తం మోటారు ప్రమాద క్లెయిమ్‌ల సంఖ్యను రాష్ట్రం, జిల్లాల వారీగా ఇవ్వాలని రోడ్డు రవాణా రహదారుల మంత్రిత్వ శాఖ(MoRTH)ని కోరారు. జైన్ దరఖాస్తుపై స్పందించిన ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) 2018 నుంచి 2023 వరకు పెండింగ్‌లో ఉన్న మోటారు ప్రమాద క్లెయిమ్‌ల సంఖ్యను వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 80,455 కోట్ల విలువైన 10,46,163 మోటారు ప్రమాద క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయని, 2018 - 23 మధ్య వాటి సంఖ్య మరింతగా పెరిగిందని ఆర్టీఐ నివేదిక పేర్కొంది.


ఆర్థిక సంవత్సరం క్లెయిమ్‌ల సంఖ్య

2018-19 - 9,09,166

2019-20 - 9,39,160

2020-21 - 10,08,332

2021-22 - 10,39,323

2022-23 - 10,46,163


క్లెయిమ్‌ల మొత్తం ఇప్పటివరకు రూ.80,455 కోట్లకు చేరుకుంది.ఇంత భారీ మొత్తంలో క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉండటంపై జైన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల సంఖ్య ఏటా పెరుగుతోందని.. రోడ్డు ప్రమాదాలలో మరణించిన, గాయపడిన వ్యక్తులపై ఆధారపడిన వారి క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని అన్నారు. క్లెయిమ్ సెటిల్‌మెంట్ల వేగాన్ని పరిశీలిస్తే.. 2022-23 ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో పెండింగ్‌లో ఉన్న కేసుల సంఖ్య 10,39,323 కాగా, 2024నాటికి కొత్త క్లెయిమ్‌ల సంఖ్య 4,54,944కి చేరింది. అలా మొత్తం పెండింగ్‌ క్లెయిమ్‌ల సంఖ్య14,94,267.


వీటిలో ఇప్పటివరకు 4,48,104 కేసులు మాత్రమే పరిష్కరించారు. ఇది మొత్తం కేసులలో 29 శాతం మాత్రమే కావడం గమనార్హం. క్లెయిమ్‌ సెటిల్ చేయడానికి ఒక్కొక్కరికి సగటున 4 సంవత్సరాలు పడుతుందని అంచనా. మోటారు యాక్సిడెంట్ క్లెయిమ్‌ల తీర్పులో విపరీతమైన జాప్యం నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల పరిహారం మధ్యంతర చెల్లింపును డిమాండ్ చేస్తూ రిట్ పిటిషన్ (సివిల్) కింద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు జైన్ తెలిపారు.

బాధితులకు ఉపశమనం లభించేలా మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 164A కింద కేంద్ర ప్రభుత్వం ఓ పథకాన్ని రూపొందించాలి.MV చట్టంలోని సెక్షన్ 164 ప్రకారం రోడ్డు ప్రమాదంలో మరణిస్తే రూ. 5 లక్షలు.. గాయాల కేసులకు రూ. 2,50,000 పరిహారం ఇవ్వాలి. కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితుల క్లెయిమ్‌లను పరిష్కరించాలని కేసీ జైన్ కోరారు.

Road Accident: దైవ దర్శనానికి వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. 12 మంది మృతి

Read National News and Latest News here

Updated Date - May 26 , 2024 | 05:55 PM