Share News

China: చైనాలో రహదారి కుంగి.. 24 మంది మృతి

ABN , Publish Date - May 02 , 2024 | 03:45 AM

చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జాతీయ రహదారి కొంత భాగం కుంగిపోవడంతో కనీసం 24 మంది మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు.

China: చైనాలో రహదారి కుంగి.. 24 మంది మృతి

బీజింగ్‌, మే 1: చైనాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ జాతీయ రహదారి కొంత భాగం కుంగిపోవడంతో కనీసం 24 మంది మరణించారు. సుమారు 30 మంది గాయపడ్డారు. ఈ ఘటన దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్‌లో బుధవారం జరిగింది. స్థానిక మీడియా ప్రకారం... గ్వాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని మీజౌ, డాగ్‌ కౌంట్‌ నగరాల మధ్య గల జాతీయ రహదారి బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో దాదాపు 18 మీటర్ల మేర కుంగింది.


అకస్మాత్తుగా రోడ్డు కుప్పకూలడంతో పెద్ద గోతి ఏర్పడింది. ఆ సమయంలో రోడ్డుపై ప్రయాణిస్తున్న 18 వాహనాలు అందులో పడిపోయాయి. ఈ వాహనాల్లో ఉన్న 54 మంది త్రీవంగా గాయపడ్డారు. సమాచారం అందడంతో రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో 24 మంది చనిపోయారు. మిగిలిన వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 03:45 AM