Share News

LokSabha Elections: బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు..

ABN , Publish Date - Apr 11 , 2024 | 07:13 PM

లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ త్వడే సమక్షంలో రోహాన్ ఆ పార్టీలో చేరారు.

LokSabha Elections: బీజేపీలోకి కొనసాగుతున్న వలసలు..
Rohan Gupta

న్యూఢిల్లీ, ఏప్రిల్ 11: లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి నాయకుల వలసలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి రోహన్ గుప్తా గురువారం బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. న్యూఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరీ, జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ త్వడే సమక్షంలో రోహాన్ ఆ పార్టీలో చేరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ విశ్వసనీయత కోల్పోయిందన్నారు.

LokSabha Elections: దక్షిణాదిలో పాగా వేస్తాం

ఆ పార్టీకి ఓ దిశ అనేది లేకుండా పోయిందని చెప్పారు. భిన్న వైరుధ్యాలతో ఆ పార్టీ సాగుతుందన్నారు. ఇక అయోధ్యలో రాముడి ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు ఎవరు పాల్గొనలేదని గుర్తు చేశారు. సీఏఏ అంశంలో ఆ పార్టీ భిన్న వైఖరితో వ్యవహరిస్తుందన్నారు. రాజకీయ పార్టీలతో జత కట్టడంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీతో స్నేహం కొనసాగిస్తుందని చెప్పారు.


PM Modi: ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేస్తున్నాం: ప్రధాని మోదీ

అయితే 2047 నాటికి ప్రధాని నరేంద్ర మోడీ దర్శనికతతో వికసిత్ భారత్‌కు మద్దతిస్తున్నట్లు రోహల్ తెలిపారు. అహ్మదాబాద్ తూర్పు లోక్‌సభ స్థానం నుంచి ఆయన తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకొన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు.

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

కాంగ్రెస్ పార్టీలోని కమ్యూనికేషన్ విభాగంలోని నాయకుల వ్యవహార శైలి పట్ల రోహల్ ఈ సందర్భంగా తీవ్ర విమర్శలు చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ మాజీ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ సైతం ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం విధితమే. రోహన్ గత 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

జాతీయ వార్తలు కోసం..

Updated Date - Apr 11 , 2024 | 07:13 PM