Share News

Ayodya: అయోధ్యలో సాధారణ విమానాల ప్రారంభం ఎప్పుడంటే...

ABN , Publish Date - Jan 07 , 2024 | 08:37 AM

అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో(Ayodya Airport) సాధారణ విమానాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని, విమానాల సంఖ్యను కూడా పెంచనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు.

Ayodya: అయోధ్యలో సాధారణ విమానాల ప్రారంభం ఎప్పుడంటే...

అయోధ్య: అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంలో(Ayodya Airport) సాధారణ విమానాలు వారం రోజుల్లో ప్రారంభమవుతాయని, విమానాల సంఖ్యను కూడా పెంచనున్నట్లు అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని ఫ్లైట్లు నడపాలని నిర్ణయించినట్లు చెప్పారు. "ఢిల్లీ నుంచి ప్రస్తుతం 180 మంది ప్రయాణికులు వస్తున్నారు. అదే సంఖ్యలో తిరిగి వెళ్తున్నారు. ఇండిగో విమానంతో పాటు రెండు నాన్ షెడ్యూల్డ్ విమానాలు ఉన్నాయి. ఇండిగో నుండి ఒక వాణిజ్య విమానం మాత్రమే ఉంది. మరో వారం రోజుల్లోనే సదరు ఫ్లైట్లన్ని అందుబాటులోకి రానున్నాయి. జనవరి 10న మరిన్ని విమానాలు అందుబాటులోకి తెస్తాం" అని ఎయిర్‌పోర్ట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ (AGM) వినోద్ కుమార్ తెలిపారు.

కాగా తాజాగా అయోధ్య విమానాశ్రయంలో దిగిన కేంద్ర మంత్రి మహేంద్ర నాథ్ పాండే ఎయిర్ పోర్ట్ డిజైన్, ఆధ్యాత్మిక కలబోతని ప్రశంసించారు. డిసెంబర్ 30న అయోధ్య రైల్వే స్టేషన్‌ను ప్రారంభించిన తర్వాత మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. గతేడాది ఏప్రిల్‌లో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అయోధ్య ఎయిర్‌పోర్ట్‌ను అభివృద్ధి చేసింది.

ఇందుకోసం రూ.1,450 కోట్ల ఖర్చు అయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ ఉన్న టర్మినల్ భవనం ఏటా 10 లక్షల మంది ప్రయాణికులకు సరిపోయేలా డిజైన్ చేశారు. టర్మినల్ భవనం లోపలి భాగాలను భగవాన్ శ్రీరాముని జీవితాన్ని వర్ణించే స్థానిక కళ, పెయింటింగ్‌లు, కుడ్యచిత్రాలతో అలంకరించారు.

Updated Date - Jan 07 , 2024 | 08:37 AM