Hardeep Nijjar Murder: భారతీయులు అరెస్ట్.. స్పందించిన జై శంకర్
ABN , Publish Date - May 05 , 2024 | 01:35 PM
హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయులు అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ అంశంపై కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
భువనేశ్వర్, మే 05: హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారతీయులు అరెస్ట్‌పై భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పందించారు. ఈ అంశంపై కెనడా పోలీసులు ఇచ్చే సమాచారం కోసం వేచి చూస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ హత్య కేసులో ముగ్గురు భారతీయులను అరెస్ట్ చేసినట్లు వార్తల్లో చూశానతి తెలిపారు. అయితే నిజ్జర్ హంతకుల వెనుక సభ్యుల ముఠా హస్తం ఉండి ఉంటుందని... ఈ నేపథ్యంలో పోలీసులు ఏం చేబుతారనే దాని కోసం వేచి చూస్తున్నట్లు చెప్పారు.
భారత్‌లో.. ముఖ్యంగా పంజాబ్‌లో నిజ్జర్ హత్యకు పథకం రూపొందించబడిందని.. దానిని కెనడాలో అమలు చేశారనే ఓ ప్రచారం జరుగుతుందన్నారు. మరోవైపు భారతీయుల అరెస్ట్‌పై కెనడాలోని భారత దౌత్యవేత్త సంజయ్ వర్మ స్పందించారు. కెనడాలోని దర్యాప్తు సంస్థలు చేపట్టిన విచారణలో భాగంగా వారి అరెస్ట్ జరిగిందని తాము భావిస్తున్నట్లు తెలిపారు.
వీరి అరెస్ట్‌తో..ఈ విచారణపై ఎప్పటికప్పుడు అప్ డేట్స్ తెలుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే శుక్రవారం అల్బర్టాలోని ఎడ్‌మౌంటన్ నగరంలో ఈ ముగ్గురు భారత జాతీయులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతేడాది కెనడాలోని వాంకోవర్ శివారు ప్రాంతం సర్రిలో గురుద్వార వెలుపల ఖలిస్తాన్ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ (45) దారుణ హత్యకు గురయ్యారు.
AP Elections: ధర్మవరంలో ప్రజాగళం.. పాల్గొన్న అమిత్ షా, చంద్రబాబు
నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన సంగతి తెలిసిందే. అలాగే తమను భారత్ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ట్రూడో ఆరోపణలు గుప్పించిన విషయం విధితమే.
For Latest News and National News click here