Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం
ABN , Publish Date - May 08 , 2024 | 08:45 PM
ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.
న్యూఢిల్లీ: ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (Indian Overseas Congress) చైర్మన్ శామ్ పిట్రోడా (Sam Pitroda) సంచలన నిర్ణయం తీసుకున్నారు. తన పదవికి రాజీనామా చేశారు. తన సొంత సమ్మతిపై ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని, ఆయన నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే వెంటనే ఆమోదించారని పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్‌చార్జి జైరామ్ రమేష్ (Jairam Ramesh) సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో తెలియజేశారు.
Sam Pitroda: శామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు...మాకు సంబంధం లేదన్న కాంగ్రెస్
వారసత్వ హక్కుపై ఇటీవల శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు, తాజాగా ఒక ఇంటర్వ్యూలో దక్షిణ భారతదేశంలో ప్రజలు ఆఫ్రికన్లులా, పశ్చిమ భారతావని ప్రజలు అరబ్బులుగా, ఈస్ట్ ప్రజలు చైనీయుల్లా ఉండారంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి. ఆయన వ్యాఖ్యలపై ఇటు ప్రధానితో సహా బీజేపీనేతలు తప్పుపట్టగా, పార్టీకి పిట్రోడా వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో అనూహ్యంగా ఆయన రాజీనామా నిర్ణయం తీసుకోవడం, పార్టీ వెంటనే ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
Read Latest National News and Telugu News