ఇందిరాగాంధీ ప్రస్తావనతో గందరగోళం
ABN , Publish Date - Dec 04 , 2024 | 04:09 AM
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో..
బ్యాంకింగ్ చట్టాల (సవరణ) బిల్లుపై లోక్‌సభలో చర్చ జరుగుతున్న సమయంలో.. ఇందిరాగాంధీ హయాంలో తనకు నచ్చినవారికి బ్యాంకు రుణాలు ఇవ్వాలని మేనేజర్లను ఆదేశించారని ఎంపీ సంబిత్ పాత్ర ఆరోపించారు. ఇలాంటి చర్యల కారణంగానే దేశంలో నిరర్థక ఆస్తులు, తిరిగి చెల్లించని రుణాలు పెరిగాయన్నారు. మోదీ హయాంలో తెచ్చిన చట్టాలతో బ్యాంకింగ్ వ్యవస్థ మళ్లీ గాడిలో పడిందన్నారు. దీనిపై విపక్షాలు పెద్దఎత్తున అభ్యంతరం తెలిపాయి. సంబిత్ పాత్ర హద్దులు దాటి మాట్లాడుతున్నారని కేసీ వేణుగోపాల్ అన్నారు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణత్యాగం చేశారని, పాకిస్థాన్‌పై యుద్ధం చేసి గెలుపొందారని చెప్పారు. స్పీకర్ జోక్యంతో సభ శాంతించింది.