Share News

18 ఏళ్లకే పైలట్‌.. కర్ణాటక యువతి రికార్డు

ABN , Publish Date - Dec 02 , 2024 | 03:29 AM

కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి 18 ఏళ్ల వయసుకే పైలట్‌ అయ్యారు.

18 ఏళ్లకే పైలట్‌.. కర్ణాటక యువతి రికార్డు

బెంగళూరు, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): కర్ణాటకలోని విజయపురకు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి 18 ఏళ్ల వయసుకే పైలట్‌ అయ్యారు. ఈ ఘనత సాధించిన దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డు సృష్టించారు. విజయపురలోనే శిక్షణ పూర్తి చేసిన సమైరా.. ఆరు నెలలపాటు ఢిల్లీలో పైలట్‌గా తర్ఫీదు పొందారు. 18 ఏళ్లకే కమర్షియల్‌ పైలట్‌ లైసెన్స్‌ సాధించారు. ఈ సందర్భంగా సమైరా మాట్లాడుతూ.. 25 ఏళ్ల వయసులో పైలట్‌ అయిన కెప్టెన్‌ తపేశ్‌ కుమార్‌ తనకు ప్రేరణ అని అన్నారు. సమైరా విజయంపై దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - Dec 02 , 2024 | 03:29 AM