Share News

Samudrayaan: దూకుడు పెంచిన ఇస్రో.. సముద్రయాన్ లాంచింగ్ అప్పుడే.. కేంద్రమంత్రి క్లారిటీ

ABN , Publish Date - Mar 10 , 2024 | 08:19 PM

‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation - ISRO) మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రాజెక్ట్‌ని చేపట్టిన ఇస్రో.. అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్‌కి (Gaganyaan) సిద్ధమవుతోంది.

Samudrayaan: దూకుడు పెంచిన ఇస్రో.. సముద్రయాన్ లాంచింగ్ అప్పుడే.. కేంద్రమంత్రి క్లారిటీ

‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation - ISRO) మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రాజెక్ట్‌ని చేపట్టిన ఇస్రో.. అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్‌కి (Gaganyaan) సిద్ధమవుతోంది. ఇదే జోరులో సముద్రయాన్ (Samudrayaan) ప్రాజెక్ట్‌ని చేపట్టేందుకు రెడీ అవుతోంది. దీని లాంచింగ్‌కి కూడా దాదాపు ముహూర్తం ఖరారు చేసింది. ఈ విషయంపై తాజాగా కేంద్ర భూ విజ్ఞాణశాస్త్ర శాఖ మంత్రి కిరణ్ రిజిజు (Kiren Rijiju) స్పందించారు.

సముద్ర గర్భ అన్వేషణ కోసం భారత్‌ చేపడుతున్న తొలి మానవ సహిత డీప్‌ ఓషన్‌ మిషన్‌ ‘సముద్రయాన్‌’ను 2025 చివరికల్లా లాంచ్ చేస్తామని కిరణ్‌ రిజిజు తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. శాస్త్రవేత్తల బృందం సముద్ర మట్టం నుంచి ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్లి పరిశోధన చేస్తారని అన్నారు. ఈ సముద్రయాన్ కోసం ‘మత్య్స’ (Matsya 6000) అనే జలాంతర్గామిని సిద్ధం చేస్తున్నారని, దీని ద్వారానే శాస్త్రవేత్తల బృందం సముద్రంలో ఆరు వేల మీటర్ల లోతులోకి వెళ్తారని చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు తుది దశలో ఉన్నాయని.. 2025 చివరికల్లా ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్ట్‌ని తాను సమీక్షించానని, ఈ ఏడాది చివరి నాటికి శాస్త్రవేత్తలు మొదటి ఉపరితల నీటి పరీక్షలను నిర్వహించగలరని పేర్కొన్నారు.


సముద్రయాన్ ప్రాజెక్ట్

ఈ సముద్రయాన్ మిషన్ 2021లో ప్రారంభమైంది. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా.. ‘మత్స్య 6000’ని ఉపయోగించి ముగ్గురు శాస్త్రవేత్తలను హిందూ మహాసముద్రంలో 6,000 మీటర్ల లోతుకు పంపనున్నారు. సముద్రజలాల్లోని వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం చేయడం కోసమే ఈ ప్రాజెక్ట్‌ని ప్రారంభించారు. మత్స్య జలాంతర్గామిని చెన్నైలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్‌ ఓషన్‌ టెక్నాలజీలో తయారు చేస్తున్నారు. ఇది 12 గంటల కార్యాచరణ సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, అత్యవసర పరిస్థితుల్లో దీనిని 96 గంటల వరకు పొడిగించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకూ ఇలాంటి ప్రాజెక్టులను అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్‌, జపాన్‌ దేశాలు విజయవంతంగా చేపట్టాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 10 , 2024 | 08:19 PM