Home » Gaganyaan Mission
‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) విజయవంతం అవ్వడంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (Indian Space Research Organisation - ISRO) మరింత దూకుడు పెంచింది. ఒక్కొక్కటిగా ఇతర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను చేపడుతోంది. ఇప్పటికే సూర్యునిపై అధ్యయనం చేసేందుకు ఆదిత్య-ఎల్1 (Aditya L1) ప్రాజెక్ట్‌ని చేపట్టిన ఇస్రో.. అంతరిక్షంలో మనుషులను పంపించేందుకు గాను గగన్‌యాన్ మిషన్కి (Gaganyaan) సిద్ధమవుతోంది.
గగన్‌యాన్ మిషన్ (Gaganyaan Mission).. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న ఈ ప్రాజెక్ట్ గురించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో - ISRO) మొదటి నుంచి కీలక విషయాలను ఒక్కొక్కటిగా పంచుకుంటూ వస్తోంది. కానీ.. ఇందులో భాగమయ్యే వ్యోమగాములు ఎవరనే విషయాన్ని మాత్రం మిస్టరీగానే ఉంచింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత ఈ మిస్టరీకి తెరదించుతూ.. నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రకటించారు.
చంద్రయాన్-3 (Chandrayaan-3), ఆదిత్య-ఎల్1 (Aditya L1) మిషన్ల తర్వాత భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో మైలురాయిని అందుకుంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ (Gaganyaan) ప్రాజెక్టులో భాగంగా.. మనుషుల్ని అంతరిక్షంలోకి సురక్షితంగా తీసుకెళ్లే సీఈ20 క్రయోజనిక్ ఇంజిన్ని సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన తుది పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘చంద్రయాన్-3’ మిషన్ పూర్తిగా విజయవంతం అయ్యింది. చంద్రునిపై అది సాఫ్ట్ ల్యాండింగ్ చేసి, అక్కడ పరిశోధనలు జరిపి, ఎంతో కీలకమైన సమాచారాల్ని భూమికి పంపింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు ఫుల్ జోష్‌లో ఉంది. అంతరిక్షంలో పరిశోధనలు చేసేందుకు గాను ప్రతిష్టాత్మక మిషన్లు చేపట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఇస్రో చేపట్టిన ‘చంద్రయాన్-3’ ప్రాజెక్ట్ విజయవంతం...
గగన్‌యాన్ మిషన్‌లో (Gaganyaan) కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయిన సంగతి తెలిసిందే. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించగా..
గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన తొలిదశ ప్రయోగం టీవీ-డీ1 (టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1) చివరి క్షణాల్లో ఆకస్మాత్తుగా ఆగిపోయింది. సాంకేతిక లోపంతో టెస్ట్ వెహికల్ ఆగిపోయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు..
వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లి మరలా క్షేమంగా కిందకు తీసుకొచ్చే లక్ష్యంతో చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌లో కీలకమైన క్రూ ఎస్కేప్ వ్యవస్థ పనితీరుని ప్రదర్శించే తొలి టెస్ట్ వెహికిల్ అబార్ట్ మిషన్-1 (టీవీ-డీ1) పరీక్షకు ఇస్రో సర్వం సిద్ధం చేసింది..