సీబీఐ కస్టడీకి సందీప్ ఘోష్, అభిజిత్
ABN , Publish Date - Sep 16 , 2024 | 04:15 AM
కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీ్‌సస్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను స్థానిక కోర్టు సెప్టెంబరు 17 వరకు సీబీఐ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
కోల్‌కతా, సెప్టెంబరు 15: కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్, తలా పోలీ్‌సస్టేషన్ ఎస్‌హెచ్‌వో అభిజిత్ మండల్‌లను స్థానిక కోర్టు సెప్టెంబరు 17 వరకు సీబీఐ కస్టడీకి పంపిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలి అత్యాచారం, హత్యకు సంబంధించి ఈ ఇద్దరిని సీబీఐ ఆ కోర్టులో హాజరుపరిచింది. ఈ కేసులో వారిద్దరిది కీలక పాత్ర అని, కోర్టు తమ కస్టడీకి ఇచ్చినందున ఇద్దరిని కలిపి ప్రశ్నిస్తామని ఓ సీబీఐ అధికారి తెలిపారు. హత్యాచార ఘటన వెనుక పెద్ద కుట్ర ఉండవచ్చని, ఘోష్, మండల్లకు అందులో కీలక పాత్ర ఉందని సీబీఐ కోర్టులో వాదించింది.