Kerala: రేపు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం
ABN , Publish Date - Jul 15 , 2024 | 08:07 PM
భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది.
తిరువనంతపురం, జులై 15: భారీ వర్షాలు, ఈదురు గాలుల నేపథ్యంలో రాష్ట్రంలో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు మంగళవారం కేరళ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఉత్తర మల్లప్పురం, కన్నూర్, కాసరగోడ్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో భారత వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ సోమవారం జారీ చేసింది. ఇక ఎర్నాకులం, త్రిశూర్, పల్కాడ్, ఇడుక్కీ, కుజికోడ్, వయనాడు జల్లాలకు ఆరంజ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read: Bihar: రష్యా సైన్యానికి హజీపూర్ బూట్లు.. పెరుగుతున్న డిమాండ్
Also Read: Iskcon: డోనాల్డ్ ట్రంప్‌ను జగన్నాథుడే కాపాడాడు
Also Read: Arvind Kejriwal: ఆరోగ్యంపై స్పందించిన తీహాడ్.. తొసిపుచ్చిన ఆప్
మరోవైపు కొట్టాయంలో ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు ఇళ్లు దెబ్బతిన్నాయి. అలాగే పలు వృక్షాలు నెలకూలాయి. వాహనాలు సైతం దెబ్బతిన్నాయి. రాష్ట్రంలో గత రెండు రోజుల నుంచి ఎడతెరపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే బలమైన ఈదరు గాలులు వీస్తున్నాయి. దీంతో పలు జిల్లాలోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించారు. మరోవైపు భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు వచ్చి చేరింది. ఈ నేపథ్యంలో ఆ యా ప్రాజెక్ట్ గేట్లను ఎత్తివేయాలని అధికారులు ఆదేశించారు. దీంతో నీరు కిందకి ప్రవహిస్తుంది. దాంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలు.. సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు సూచించారు.
Priyanka Gandhi: నిద్ర నుంచి మేల్కోవాలంటూ మోదీకి చురకలు
Also Read:Donald Trump: ఆఫీసర్.. ఆఫీసర్ అన్నా పట్టించుకోలేదా?
Also Read: Pune Police: పరారీలో పూజా ఖేద్కర్ తల్లిదండ్రులు
భారీ వర్షాల కారణంగా పలు ప్రధాన రహదారులపై భారీగా నీరు నిలిచిపోతుందని.. దీంతో ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిచిపోయే అవకాశాలున్నాయని కేరళ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. అలాగే పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయంది. ఇక భారీ వృక్షాలు నెల కూలండంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుందని సూచించింది.
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News