Share News

LokSabha Elections: చెత్త కుప్పలో ఓటరు ఐడీలు.. విచారణకు ఆదేశం

ABN , Publish Date - May 10 , 2024 | 05:42 PM

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. అలాంటి వేళ చెత్త కుప్పలో.. కుప్పగా పడి ఉన్న ఓటర్ ఐడీలను స్థానికులు గుర్తించారు. అనంతరం ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

LokSabha Elections: చెత్త కుప్పలో ఓటరు ఐడీలు.. విచారణకు ఆదేశం

ముంబై, మే 10: దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ వివిధ దశల్లో జరుగుతున్నాయి. అలాంటి వేళ చెత్త కుప్పలో.. కుప్పగా పడి ఉన్న ఓటర్ ఐడీలను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంటనే జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో ఉన్నతాధికారి.. ఆ ఓటర్ ఐడీలను స్వాధీనం చేసుకొని.. సీజ్ చేశారు.

LokSabha Elections: నామినేషన్ గడువు కొన్ని నిమిషాలే ఉంది.. శశాంక్ ఏం చేశాడంటే..

ఈ ఘటన మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో శుక్రవారం చోటు చేసుకుంది. చెత్త కుప్పలో ఓటర్ ఐడీల అంశంపై విచారణకు ఆదేశించామని జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్ పంచాల్ వెల్లడించారు. అయితే ఈ ఓటర్ ఐడీలన్నీ పాతవి.. గడువు ముగిసిన ఓటరు ఐడీ కార్డులుగా గుర్తించామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని తెలిపారు.

Delhi Police: బాలిక కిడ్నాప్ కేసు.. 24 గంటల్లో ఛేదించిన పోలీసులు


AP Elections: రోజా నిజస్వరూపం పోసాని లీలలు బయటపెట్టిన కిరాక్ ఆర్పీ ..!

అయితే ఈ ఓటర్ ఐడీ అడ్రస్‌ గల చిరునామా ఆధారంగా దర్యాప్తు చేస్తామని వివరించారు. ఇక సదరు ఓటర్లకు కొత్త ఓటర్ ఐడీ కార్డులను ఎన్నికల సంఘం జారీ చేసిందని తెలిపారు. ఈ ఓటర్ ఐడీలు ఇక్కడ పడవేయడం వెనుక ఏదైనా ఉద్దేశ్యం ఉందా? వీటిని ఎక్కడ నుంచి తీసుకు వచ్చారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ కృష్ణకాంత్ వివరించారు.

AP Elections: కొడాలి నాని అడ్డాలో కుమారీ ఆంటీ..!

మరోవైపు మహారాష్ట్రలోని పలు లోక్‌సభ స్థానాలకు నాలుగో విడతలో.. అంటే మే 13వ తేదీన పోలింగ్ జరగనుంది. అలాంటి వేళ.. ఈ ఓటర్ ఐడీ కార్డులు ఇలా చెత్త కుప్పలో స్థానికులు గుర్తించడం పట్ల సర్వత్రా భిన్నాభిప్రాయలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

Read Latest National News And Telugu News

Updated Date - May 10 , 2024 | 05:42 PM