Delhi Deal: ఢిల్లీ డీల్ ఫిక్స్.. ఆప్, కాంగ్రెస్‌కు ఎన్ని సీట్లంటే
ABN , Publish Date - Feb 22 , 2024 | 01:49 PM
ఒకవైపు పంజాబ్‌లో సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతూనే మరోవైపు ఢిల్లీలో ఎంపీ సీట్ల కోసం కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఫార్ములా ఖారురు చేసింది.
ఒకవైపు పంజాబ్‌లో సొంతంగా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సిద్ధమవుతూనే మరోవైపు ఢిల్లీలో ఎంపీ సీట్ల(Lok Sabha elections 2024) కోసం కాంగ్రెస్(congress) పార్టీతో పొత్తు ఫార్ములా ఖారురు చేసింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో 4-3 ఫార్ములాకు ఫిక్సైంది. అంటే ఆమ్ ఆద్మీ పార్టీ 4 స్థానాల్లో, కాంగ్రెస్ 3 స్థానాల్లో పోటీ చేయనుంది. కాంగ్రెస్ 4 సీట్లు డిమాండ్ చేస్తున్నప్పటికీ చివరకు ఈ ఫార్ములా ఖరారైందని తెలిసింది. అయితే దీని గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి: కాంగ్రెస్ ఖాతాల నుంచి రూ.65 కోట్లు విత్‌డ్రా
ఆప్ ఎన్నికల్లో పోటీ చేసే స్థానాలు
1.న్యూ ఢిల్లీ
2. వాయువ్య ఢిల్లీ
3. పశ్చిమ ఢిల్లీ
4. దక్షిణ ఢిల్లీ
కాంగ్రెస్ పోటీ చేసే మూడు స్థానాలు
1. తూర్పు ఢిల్లీ
2. ఈశాన్య ఢిల్లీ
3. చాందినీ చౌక్
4-3 ఫార్ములా విషయంలో ఆప్(AAP) ఇచ్చిన వాదనలో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్(congress) ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని పేర్కొన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో MCD ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు కూడా పేలవంగా ఉందని ఆప్ చెప్పినట్లు సమాచారం. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ రెండూ కూడా గెలవలేదు. మొత్తం 7 సీట్లను బీజేపీ గెల్చుకుంది. 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 23 శాతం ఓట్లు రాగా, ఆప్‌కి 18 శాతం ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో ఈసారి ఎలాగైనా బీజేపీని కట్టడి చేయాలని కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఏకమయ్యాయి.