Share News

హిడ్మా కోసం 10 వేలకు పైగా బలగాలు!

ABN , Publish Date - Dec 28 , 2024 | 06:09 AM

మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా కోసం ఛత్తీ్‌సగఢ్‌ అడవులను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. వేలాది మంది వాగులు, వంకలు దాటుతూ గాలిస్తున్నారు.

హిడ్మా కోసం 10 వేలకు పైగా బలగాలు!

  • ఛత్తీ్‌సగఢ్‌ అడవుల్లో ముమ్మర వేట

చర్ల, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మాద్వి హిడ్మా కోసం ఛత్తీ్‌సగఢ్‌ అడవులను భద్రతా దళాలు జల్లెడ పడుతున్నాయి. వేలాది మంది వాగులు, వంకలు దాటుతూ గాలిస్తున్నారు. హిడ్మా టార్గెట్‌గా ఐదు క్యాంపుల ద్వారా.. దాదాపు 10 వేలకు పైగా బలగాలు అడవుల్లో ముమ్మర వేట సాగిస్తున్నాయి. బీజాపూర్‌, సుకుమా జిల్లాల అడవుల్లో చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో డీఆర్‌జీ, కోబ్రా, ఎస్టీఎఫ్‌, మహిళా కమాండోలు పాల్గొంటున్నారు. హిడ్మా సొంతూరైన సుకుమా జిల్లా పూవర్తిలో కొద్దినెలల కిందే సీఆర్‌పీఎఫ్‌ క్యాంపును ఏర్పాటు చేశారు. అనంతరం పూవర్తి పక్కనే ఉన్న కొండపల్లి, గుండం గ్రామాల్లోనూ క్యాంపులు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 28 , 2024 | 06:09 AM